ETV Bharat / city

స్టీల్ ప్లాంట్​ను రక్షించేందుకు మా వంతు పోరాటం చేస్తాం: బొత్స - vizag steel plant privatization

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై వైకాపా మంత్రులు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. అవసరమైతే అందరూ దిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలుస్తామని మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

మంత్రి బొత్స
మంత్రి బొత్స
author img

By

Published : Mar 8, 2021, 10:30 PM IST

Updated : Mar 9, 2021, 4:36 AM IST

స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తుదివరకూ పోరాడతామని మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు స్పష్టం చేశారు. ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ప్రధానికి ముఖ్యమంత్రి ఇప్పటికే లేఖ రాశారని, లేఖలోని అంశాలకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి బొత్స తెలిపారు. వైకాపాపై విమర్శలు చేస్తున్న తెలుగుదేశం నేతలు.. ఇప్పటివరకూ ఆ పార్టీ తరఫున ప్రధానికి లేఖ ఎందుకు రాయలేకపోయారని నిలదీశారు. కార్మికుల ఆందోళనకు తాము మద్దతిస్తున్నట్లు వెల్లడించారు.

వైకాపాలో ఓ సీనియర్ నేత కొంతమంది నాయకులతో కలిసి తిరుగుబాటు ప్రయత్నాలు చేస్తున్నారంటూ.. జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. పార్టీలో ఎక్కడా అసమ్మతి, విభేదాలు లేవని తెలిపారు. సీఎంకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలాంటి ఆవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, దీన్ని మానుకోవాలని సజ్జల సూచించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

ఇదీచదవండి.

మహాశివరాత్రి సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Last Updated : Mar 9, 2021, 4:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.