పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజలపై భారం మోపటం సరికాదని తెదేపా అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ వ్యాఖ్యానించారు. గత 15 రోజుల్లో పెట్రోల్‌పై 8.50 రూపాయలు, డీజిల్‌పై 9 రూపాయలు పెంపు దుర్మార్గమని మండిపడ్డారు. లీటర్ డీజిల్‌పై ప్రత్యక్షంగా 16, పరోక్షంగా 22 రూపాయలు ఆదాయం వస్తున్నా... పెంపు దారుణమన్నారు.
తెదేపా హయాంలో లీటర్‌పై రూ.2 చొప్పున భారాన్ని ప్రభుత్వమే భరించిందని గుర్తు చేశారు. గతంలో డీజిల్‌పై గరిష్ఠంగా 11, పెట్రోల్‌పై గరిష్ఠంగా 18 రూపాయలు మాత్రమే ఆదాయం రాగా.. నేడు లీటర్‌పై 30 రూపాయల వరకు ఆదాయం వస్తున్నా.. నిత్యం ధరలు పెంచడం బాధాకరమని తెలిపారు.