రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్నా... పరీక్షలు, చికిత్స, వసతుల కల్పనలో ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని తెదేపా అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ ఆరోపించారు. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను జేసీబీలతో పూడ్చటం... క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స తీసుకుంటున్న వారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పరీక్షల్లో కచ్చితత్వాన్ని పాటించకపోవడం వంటి చర్యలతో ప్రభుత్వం వైరస్ను కట్టడి చేస్తున్నట్లు ప్రజలను మభ్యపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రజలు లెక్కిస్తున్నారని... పరిపాలన అంటే సినిమా కాదన్న విషయాన్ని జగన్ సర్కారు గుర్తెరగాలని హితవు పలికారు.
కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం: గొట్టిపాటి - కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం
కరోనా వైరస్ను కట్టడి చేయటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ ఆరోపించారు. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్నా... పరీక్షలు, చికిత్స, వసతుల కల్పనలో ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని మండిపడ్డారు.
![కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం: గొట్టిపాటి కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7973118-76-7973118-1594383852043.jpg?imwidth=3840)