ప్రభుత్వాసుపత్రుల్లో వైకాపా పెద్దల అవినీతి రాజ్యమేలుతోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ఐసీయూలో ఉన్న వైద్య రంగానికి తక్షణ చికిత్స అవసరమని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో వైద్యరంగం గత మూడేళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే అనేక మంది ప్రాణాలు విడిచారన్నారు. ప్రభుత్వాసుపత్రులు కనీసం మందులు కూడా దొరకని నరక కూపాలుగా ఉన్నాయని విమర్శించారు.
వైకాపా నేతల కనుసన్నల్లోనే అంబులెన్స్ మాఫియా నడుస్తోందని గోరంట్ల ఆరోపించారు. ఆరోగ్యశ్రీ బిల్లులు రావట్లేదని ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగుల్ని పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తంచేశారు. "నాడు-నేడు" పనులు ఎక్కడికక్కడ పడకేశాయని దుయ్యబట్టారు. కాంట్రాక్టర్లకు లక్ష కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టడం వల్ల పనులు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రావట్లేదని తెలిపారు.
ఇవీ చూడండి