విజయవాడలో బీటెక్ యువతిని చంపి.. తాను కత్తితో గాయపర్చుకున్న నిందితుడు నాగేంద్రబాబు పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తెలిపారు. నిన్న మధ్యాహ్నం కత్తిపోట్లతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన నాగేంద్రబాబుకు రాత్రి శస్త్రచికిత్స చేసినట్లు ప్రభావతి అన్నారు. నాగేంద్రబాబు పొట్ట భాగంలో అహారవాహిక, పలు రక్తనాళాలు బాగా దెబ్బతిన్నాయన్నారు. దానితో తీవ్ర రక్తస్రావం అయ్యిందన్నారు. రాత్రి శస్త్ర చికిత్స చేసి దెబ్బతిన్న రక్తనాళాలకు చికిత్స చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం బీపీ లెవల్స్, పల్స్ బాగానే ఉన్నాయన్నారు. అయితే రెండు రోజులు గడిచిన తరువాత మాత్రమే నాగేంద్రబాబు పరిస్థితి చెప్పగలమని డాక్టర్ ప్రభావతి వివరించారు.
ఇదీ చదవండి: దుర్గ గుడి పైవంతెన ప్రారంభం.... వర్చువల్గా పాల్గొన్న జగన్, గడ్కరీ