ETV Bharat / city

వెల్లివిరిసిన దాతృత్వం... పేదల మోముల్లో ఆనందం

రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్ కట్టుదిట్టంగా కొనసాగుతోంది. ఈ నిబంధనతో ఉపాధి కోల్పోయిన పేదలు, కార్మికులు, వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థను గమనించి కొందరు దాతలు, స్వచ్ఛంద సంస్థలు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. తమవంతు సహాయం అందిస్తూ అన్నార్తులకు బాసటగా నిలుస్తున్నాయి.

author img

By

Published : May 1, 2020, 10:09 PM IST

ftate wise food distribution in andhrapradhesh
పేదలకు కూరగాయలు పంపిణీ చేస్తున్న దాతలు

చిత్తూరు జిల్లాలో
చిత్తూరు జిల్లా గుర్రంకొండ, వాల్మీకిపురం మండలాల్లో స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేదలకు నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేశారు.

అనంతపురం జిల్లాలో

అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలంలోని సౌర విద్యుత్తు ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించేలా చొరవ చూపుతామని భాజపా నాయకుడు వజ్ర భాస్కర్ రెడ్డి అన్నారు. సమస్యను ఎన్టీపీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆయా కంపెనీల ద్వారా కార్మికులకు వేతనాలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రకాశం జిల్లాలో

మేడే సందర్భంగా ప్రకాశంజిల్లా చీరాల నియోజకవర్గ వైకాపా నాయకుడు కృష్ణమోహన్ పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఉపాధి కోల్పోయిన పేదల అవస్థను చూసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన అన్నారు.

కర్నూలు జిల్లాలో

కర్నూలు జిల్లా నంద్యాల 42 వార్డులో భవన కార్మికులకు తెదేపా నాయకుడు చింతలపల్లి సుధాకర్ రావు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. బియ్యంతో పాటు అయిదు రకాల వస్తువులు అందించారు

తూర్పుగోదావరి జిల్లాలో

కరోనా వైరస్ నియంత్రణకు తమ వంతు సాయంగా తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మూలస్థానంకు చెందిన ఆరుగురు యువకులు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.1.50 లక్షలు అందించారు. మండపేటలో నిర్వహించిన నిత్యావసరాల పంపిణీలో కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పట్టణంలోని పేదలకు కాపు యువత సభ్యుల ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

నెల్లూరు జిల్లాలో

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం వద్ద ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేతుల మీద వాలంటీర్లు, ఆశా, 108, 104 సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి బియ్యం బస్తా, నిత్యావసర వస్తువులు అందించారు. యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు నాయుడుపేట వాసి ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.

గుంటూరులో

అమెరికాకు చెందిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ మేరీలాండ్ ఆర్థిక సహకారంతో గుంటూరు నగరం యడ్లపాడులో భవన నిర్మాణ కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

కడప జిల్లాలో

లాక్​డౌన్ అత్యవసర సేవలందిస్తున్న పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాజంపేట డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి సూచించారు. ఒంటిమిట్టలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు నీళ్ల బాటిళ్లను, కళ్లజోళ్లు, మాస్కులు అందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.