తెలుగు అకాడమీ పేరు మారుస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ డిమాండ్ చేశారు. అకాడమీని యథావిధిగా కొనసాగించాలని కోరుతూ.. ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు.
అకాడమీ పేరు మార్పును పార్టీలు వ్యతిరేకించాయని.. సామాజిక మాధ్యమాల్లోనూ పెద్దఎత్తున నిరసనలు వెలువెత్తుతున్నాయని బుద్ధ ప్రసాద్ చెప్పారు. అకాడమీకి రావాల్సిన రూ.200 కోట్లను వెంటనే విడుదల చేయాలని.. అలాగే సంస్కృత అకాడమీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కోరారు.
ఇదీ చదవండి:
'తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులపై పార్లమెంట్లో ప్రస్తావిస్తాం'