ETV Bharat / city

ప్రేమ.. పగ.. ఫుట్​బాల్ ప్లేయర్ హత్య - పుట్​బాల్ ప్లేయర్ హత్య కేసు న్యూస్

ప్రేమ వ్యవహారం ఇద్దరు స్నేహితుల మధ్య చిచ్చు రేపింది. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. విజయవాడ నగరంలో సంచలనం రేపిన ఫుట్​బాల్ ప్లేయర్ ఆకాశ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసులో 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు.

పుట్ బాల్ ప్లేయర్ హత్యకేసు
పుట్ బాల్ ప్లేయర్ హత్యకేసు
author img

By

Published : Jun 7, 2022, 10:04 PM IST

Football Player Murder case: ఈనెల 1న విజయవాడలో కలకలం రేపిన ఫుట్​బాల్ ప్లేయర్ ఆకాశ్ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని పోలీసులు నిర్ధరించారు. డీసీపీ జాషువా తెలిపిన వివరాల ప్రకారం.. గుణదలకు చెందిన ఆకాశ్ ఫుట్​​బాల్ కోచ్​గా పని చేస్తున్నాడు. స్థానికంగా ఉండే ఓ యువతితో సన్నిహితంగా ఉండేవాడు. ఆ యువతి అదే ప్రాంతానికి చెందిన గోపీకృష్ణ అలియాస్ ప్రభతో కూడా సన్నిహితంగా మెలిగేది. దీంతో గత రెండేళ్లుగా ఆకాశ్, ప్రభల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో గత నెల 31న వాంబే కాలనీకి చెందిన రౌడీషీటర్ టోనీ మృతదేహాన్ని చూసేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి ఆకాశ్ వెళ్లాడు. అనంతరం స్నేహితులతో కలిసి మద్యం దుకాణానికి వెళ్లి మద్యం సేవిస్తున్నాడు. అదే మద్యం దుకాణానికి ప్రభ కూడా తన స్నేహితులతో కలిసి వచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం అక్కడ నుంచి అందరూ వెళ్లిపోయారు.

గొడవను మనసులో పెట్టుకున్న ప్రభ ఎలాగానే ఆకాశ్​ను హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. తన అన్న మురళీకృష్ణ, మరికొందరితో కలిసి హత్యకు పథకం రచించాడు. సమయం కోసం వేచిచూస్తున్న ప్రభకు.. ఆకాశ్​ కనకదుర్గా గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీలో తన స్నేహితుని రూమ్​కి వెళ్లినట్లు తెలిసింది. అక్కడి చేరుకున్న ప్రభ తన స్నేహితులతో కలిసి మద్యం మత్తులో నిద్రిస్తున్న ఆకాశ్​పై కత్తితో దాడి చేసి హత్య చేశారు. అనంతరం నిందితులు గ్రూపులుగా విడిపోయారు. కొందరు నెల్లూరు, చెన్నై, విశాఖ ప్రాంతాలకు పరారయ్యారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మొత్తం 11 మందిని అరెస్ట్‌ చేశారు.

నిందితుల నుంచి హత్యకు వినియోగించిన కత్తి, రెండు ద్విచక్రవాహనాలు, 8 సెల్​ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో అధికంగా డిగ్రీ వరకు చదువుకుని.., మద్యానికి బానిసలుగా మారి చెడు దారిలో నడుస్తున్నారని పోలీసులు వెల్లడించారు. వీరిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.