విజయవాడలో ఫలపుష్ప ప్రదర్శన ప్రారంభమైంది. మొగల్రాజపురం సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల మైదానంలో ఈ రోజు నుంచి జనవరి 6 వరకు జరగనుంది. హరితప్రియ ప్లాంట్ లవర్స్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ రోజ్ సొసైటీ, విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. పుష్పప్రదర్శనను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు.
రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు.. మొక్కలను ప్రదర్శనలో ఉంచారు. సుమారు మూడు వందల రకాలపైగా గులాబీ, ఐదు వందల రకాలకుపైగా చామంతి మొక్కలను కాకినాడ, కడియం, పుణె, బెంగళూరు నుంచి తీసుకువచ్చారు. ఆర్కిడ్స్, బోన్సాయ్, ఇండో తదితర మొక్కలను ప్రదర్శించారు. సేంద్రీయ, ప్రకృతి పద్ధతిలో సాగుచేసే రైతులకు ప్రత్యేకమైన స్టాల్స్ కేటాయించారు.
ఇదీ చదవండి