తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మణికొండ ల్యాంకో హిల్స్ అదే అపార్టుమెంట్లో నివసించే శ్రీనివాస్ రెడ్డి తన ఆరు సంవత్సరాల కూతురితో కలిసి లిఫ్ట్ ఎక్కాడు. 34వ అంతస్తుకు చేరుకున్నాక లిఫ్ట్ ఆగిపోయింది. తలుపులు తెరుచుకోలేదు. ఆందోళన చెందిన శ్రీనివాస్ రెడ్డి ఫోన్ కాల్స్ చేసినా అపార్ట్మెంట్ వాసులెవరూ స్పందించలేదు.
సుమారు 40 నిమిషాల పాటు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి వేదన అనుభవించారు. చివరికి తానే స్వయంగా లిఫ్ట్ తలుపుల్ని తొలగించి కూతురుతో సహా బయటపడ్డారు. లాక్డౌన్ నేపథ్యంలో ఎక్కడివాళ్లు అక్కడే ఉండటం వల్ల తండ్రి, కూతురు ఫోన్‌కు ఎవరూ స్పందించలేదు. విపత్కరమైన దుస్థితిని శ్రీనివాస్ రెడ్డి విజయవంతంగా ఎదుర్కొన్నారు.