ETV Bharat / city

సున్నా వడ్డీకి ఏదీ అండ?.. వాణిజ్య బ్యాంకుల మోకాలడ్డు - సహకార బ్యాంకులో సున్నా వడ్డీ రుణాలు న్యూస్

ఏడాదిలోగా పంట రుణాలు చెల్లించే రైతులకు సున్నా వడ్డీ ప్రయోజనాలను వర్తింపజేయడంలో అధిక శాతం వాణిజ్య బ్యాంకులు మోకాలడ్డుతున్నాయి. కేంద్రం ఇచ్చే 5% వడ్డీ రాయితీని మినహాయించి మిగిలిన మొత్తాన్ని రైతుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి.

farmers facing problems with zero interest loans

author img

By

Published : Jul 12, 2020, 6:19 AM IST

సహకార బ్యాంకులు మాత్రం రుణం చెల్లించే సమయంలో సున్నా వడ్డీ వర్తింపజేసి (2018-19 వరకు) తర్వాత ప్రభుత్వం నుంచి తీసుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. అందుకే అయిదేళ్ల బకాయిల కింద ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన రూ.1,053 కోట్లలోనూ 40% వాటా ఈ బ్యాంకుల పరిధిలోని రైతులకే చేరనుంది. 5 గ్రామీణ బ్యాంకుల పరిధిలోని రైతులకు 31.5% అందుతుండగా.. 17 వాణిజ్య, ప్రైవేటు బ్యాంకుల పరిధిలో పంట రుణాలు పొందిన వారికి 28.5% మాత్రమే దక్కుతోంది. గ్రామీణ బ్యాంకుల్లోనూ.. ఆంధ్రప్రగతి గ్రామీణబ్యాంకు (ఏపీజీబీ) మినహా మిగిలినవన్నీ అంతగా పట్టించుకోవడం లేదు. ఏడాదిలోగా రుణం చెల్లించిన రైతుల జాబితాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు పంపడంలోనూ శ్రద్ధ చూపట్లేదు. ఫలితంగా అన్నదాతలు ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రాయితీకి దూరమవుతున్నారు.

2018-19లోనే రూ.800 కోట్లు
రెండేళ్ల కిందట (2018-19) ఖరీఫ్‌, రబీకి కలిపి బ్యాంకులు రూ.76,721 కోట్ల పంట రుణాలనిచ్చాయి. ఇందులో ఏడాదిలోగా రైతులు 75% చెల్లించినా రూ.57,540 కోట్లు బ్యాంకులకు జమవుతాయి. వాటి నుంచి బంగారంపై రుణాలు, రూ.లక్షకు పైగా ఇచ్చే పంట రుణాల కింద 40శాతం వరకు తీసేసినా రూ.34వేల కోట్ల వరకు గడువులోగా చెల్లిస్తున్నట్లే.
ఇలా ఏడాదిలో చెల్లించే పంట రుణంపై విధించే 9 శాతం వడ్డీ నుంచి కేంద్రం 5% రాయితీనిస్తోంది. మిగిలిన 4 శాతం సున్నా వడ్డీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెల్లిస్తుంది. ఈ లెక్కన రూ.34వేేల కోట్లకు రూ.1,360 కోట్ల మేర సున్నా వడ్డీ రూపంలో రైతులకు అందాల్సి ఉంది. అయితే మొత్తం సున్నా వడ్డీ ప్రయోజనాలు రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్లకు మించడం లేదు.
* 2018-19లో మొత్తం సున్నా వడ్డీ బకాయిలుగా రూ.557.58 కోట్లను తేల్చారు. అంటే సక్రమంగా చెల్లించిన రుణాల్లో 41% మాత్రమే సున్నా వడ్డీ పరిధిలోకి వస్తుంది. 51% రుణాలను ఏడాదిలోగా క్రమం తప్పకుండా చెల్లించినా ప్రయోజనం దక్కడం లేదు. ఇలా ఏడాదిలో రూ.800 కోట్ల మేర రైతులు కోల్పోయారు. అయిదేళ్లకు చూస్తే రూ.4వేల కోట్ల మేర సొమ్ము చేజారినట్లే.
* సున్నా వడ్డీ కింద ఆప్కాబ్‌కు రూ.171.25 కోట్లు, ఏపీజీబీకి రూ.111.05 కోట్లు విడుదలయ్యాయి. వాణిజ్య బ్యాంకుల్లో ఆంధ్రా బ్యాంకుకు రూ.103.02 కోట్లు, ఎస్‌బీఐకి రూ.51.39 కోట్లు మంజూరయ్యాయి. వాస్తవానికి ఆ ఏడాది ఎస్‌బీఐ రూ.13,740 కోట్లు, ఆంధ్రా బ్యాంకు రూ.11,086 కోట్ల పంట రుణాలనిచ్చాయి. ఆప్కాబ్‌ పరిధిలోని సహకార బ్యాంకులు రూ.12,736 కోట్ల పంట రుణాలనిచ్చాయి. అంటే ఎక్కువ రుణాలిచ్చిన బ్యాంకులకంటే ఆప్కాబ్‌కే సున్నా వడ్డీ రాయితీ ఎక్కువగా వచ్చింది.
* రాష్ట్రంలో ఏటా పంట రుణాలిచ్చే బ్యాంకుల్లో ఎస్‌బీఐ వాటా 26%, ఆంధ్రాబ్యాంకు వాటా 21% పైనే. సిండికేట్‌, ఇండియన్‌, కెనరా తదితర బ్యాంకుల వాటా మరో 25% వరకుంటుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సున్నా వడ్డీ నిధుల్లో వాణిజ్య, ప్రైవేటు బ్యాంకులన్నిటికీ కలిపి రూ.300 కోట్లు (28.5%) మాత్రమే వచ్చాయి. అధిక శాతం రుణాలిచ్చే ఎస్‌బీఐ వాటా 9 శాతానికే పరిమితమైంది.

ఇప్పటికీ మించి పోలేదు
ఏడాదిలోగా చెల్లించిన పంట రుణాలపై కేంద్రం 5% వడ్డీని బ్యాంకులకు తిరిగి చెల్లిస్తుంది. అంటే సంబంధిత రైతుల జాబితాతోనే బ్యాంకులు కేంద్రానికి క్లెయిమ్‌ చేస్తాయి. ఇదే జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికిస్తే సున్నా వడ్డీ రాయితీ దక్కుతుంది. బకాయిల విడుదలకు ప్రభుత్వం ముందుకొచ్చినందున ఈ దిశగా బ్యాంకర్లు, వ్యవసాయశాఖ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.