కేంద్ర ప్రభుత్వం రైతుల ఉద్యమంపై రకరకాల నిందలు వేస్తూ అవమానించడం సరికాదని.. రైతులను ఉగ్రవాదులతో పోలుస్తూ ఉద్యమాన్ని కించపరచడం దారుణమని రైతు సంఘాల నాయకులూ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 58 రోజులుగా దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా విజయవాడ ధర్నా చౌక్‌లో రైతు సంఘాలు ధర్నా చేపట్టాయి.
రాష్ట్రాల పరిధిలో ఉన్న వ్యవసాయాన్ని కేంద్రం తమ చేతుల్లోకి తీసుకుని రైతు వ్యతిరేక చట్టాలను చేస్తోందని రైతు సంఘం నాయకులు ఆరోపించారు. మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేందుకు మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చారని... తక్షణమే మూడు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఇదీ చదంవండి: 'మత విద్వేషాలు రేచ్చగొట్టేందుకే భాజపా, జనసేన, తెదేపా ప్రయత్నం'