ETV Bharat / city

వివాదంలో బుక్కైన ఫేస్‌బుక్‌.. అసలేంటీ రగడ? - bjp social media

ఫేస్‌బుక్‌. సామాజిక మాధ్యమాల్లో దిగ్గజం. జనాభా లెక్కన చూస్తే తనకున్న ఖాతాదారులతో ఫేస్‌బుక్‌ 3వ అతిపెద్ద దేశంగా నిలుస్తోంది. ఇన్ని ప్రత్యేకతలున్న ఫేస్‌బుక్​కి.. భారత్‌లోనే అత్యధిక ఖాతాదారులున్నారు. స్నేహితులతో ఛాటింగ్‌ మొదలు.. సామాజిక కార్యక్రమాలు, ఆన్‌లైన్‌ ఉద్యమాలు... ఎన్నికల ప్రచారాలన్నింటికీ ఫేస్‌బుక్కే అడ్డా. రాజకీయనాయకుల ప్రసంగాలకు ఇదే అత్యుత్తమ వేదిక. అలాంటి ఫేస్‌బుక్‌ ఇప్పుడో వివాదంలో బుక్కైంది. ఇప్పటికే పలుమార్లు... ఎన్నికలు, రాజకీయపార్టీల అనుబంధంతో అనేక చిక్కుల్లో పడ్డ సామాజిక మాధ్యమాల దిగ్గిజం.. మరోసారి తమ నిబంధనలపై నిబద్ధతెంతో స్పష్టతనివ్వాల్సిన పరిస్థితులు వచ్చిపడ్డాయి. ఉన్నట్టుండి ఈ వివాదం ఎందుకు చెలరేగింది ? ఫేస్‌బుక్‌పై కొత్త ప్రశ్నలు ఎందుకొస్తున్నాయి ? అసలేంటీ రగడ ?

వివాదంలో బుక్కైన ఫేస్‌బుక్‌.. అసలేంటీ రగడ?

author img

By

Published : Aug 17, 2020, 11:51 PM IST

విద్వేషపూరిత వ్యాఖ్యలు, వివాదాస్పద ప్రసంగాలు. సామాజిక మాధ్యమాల్లో.... ఇవి సర్వ సాధారణం. ముఖ్యంగా ప్రముఖులు పెట్టే పోస్టులపై.. ఈ తరహా కామెంట్లు కోకొల్లలు. కానీ, అవే వ్యాఖ్యలు ప్రముఖులు చేస్తే, ముఖ్యంగా ప్రజలను ప్రభావితం చేయగలిగిన ప్రజాప్రతినిధులు చేస్తే.. సదరు ప్లాట్‌ఫామ్‌ వెంటనే ఆ వ్యాఖ్యలు తొలగిస్తుంది. ఆ ఖాతాపై చర్యలకు ఉపక్రమిస్తుంది. పెద్ద వివాదాలకు దారితీసే.. సున్నితమైన అంశాలపై వ్యాఖ్యలు చేసినప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహ రిస్తుంటాయి సామాజిక మాధ్యమాలు. అలాంటివి గుర్తించటం కోసం ప్రత్యేక బృందాలు కూడా పని చేస్తుంటాయి. ఐతే ఇప్పుడు దేశంలో అధికార భాజపా నేతలు ఫేస్‌బుక్‌లో చేసే విద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రసంగాలను ఆ సంస్థ చూసీచూడనట్లు వదిలేస్తోందనే ఆరోపణ వివాదానికి కారణం అయింది.

వాస్తవ కథనం..

‘‘భారత్‌లో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లను భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రిస్తాయి. వీటి ద్వారా వారు నకిలీ వార్తలు, విద్వేషం ప్రచారం చేస్తారు. అలానే వీటితో ఎన్నికలను కూడా ప్రభావితం చేస్తారు. ఫేస్‌బుక్‌ గురించి అమెరికన్ వార్తా సంస్థ వాస్తవ కథనం ప్రచురించింది" అని ట్వీట్‌ చేశారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ. భాజపా తప్పుడు ప్రచారం, రెచ్చగొట్టే ప్రసంగాలు, విద్వేషపూరిత వ్యాఖ్యలు వ్యాప్తి చేస్తూ ఎన్నికలను ప్రభావితం చేస్తారని ట్విటర్ వేదికగా విమర్శలకు దిగారు. ఫేస్‌బుక్ గురించి అసలు నిజం అమెరికాకు చెందిన 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' బయటపెట్టిందని పేర్కొన్నారు. అందులో వచ్చిన కథనాన్ని జతచేస్తూ ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. అది వివాదానికి దారి తీసింది. ఫేస్‌బుక్‌ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

సంచలన కథనం..

ఫేస్‌బుక్‌లో భాజపా నేతల విద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రసంగాలు చూసీ చూడనట్లు వదిలేస్తూ.. చర్యలు తీసుకోవడం లేదంటూ ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్‌' సంచలన కథనం రాసింది. భారత్‌లో తమ వ్యాపార లావాదేవీలు దెబ్బతినకుండా ఉండేందుకే ఫేస్‌బుక్ అలా చేస్తోందని ఆ కథనంలో పేర్కొంది. భాజపా నేతల విద్వేష పూరిత ప్రసంగాలపై చర్యలు తీసు కోవడం వల్ల దేశంలో వ్యాపారం దెబ్బతినే ప్రమాదముందని ఫేస్‌బుక్ ప్రతినిధి ఒకరు ఉద్యోగులతో అన్నట్లు అందులో ఉంది. తెలంగాణ ఏకైక భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ రోహింగ్యా ముస్లింపై చేసిన ఫేస్‌బుక్ పోస్టులనూ ప్రస్తావించింది. రాజాసింగ్‌తో పాటు మరో ముగ్గురు నేతల ప్రసంగాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఫేస్‌బుక్‌ ఉద్యోగులు గుర్తించినా... చర్యలు తీసుకోలేదని ఆ కథనం వెల్లడించింది.

బిజినెస్‌ మీద ప్రభావం..

భారతదేశంలో ఫేస్‌బుక్‌ సంస్థ తరఫున వ్యాపార లావాదేవీలకు సంబంధించి లాబీయింగ్‌ కూడా చేసే ఫేస్‌బుక్‌ ప్రతినిధి, భాజపా నేతలపై చర్యలు తీసుకుంటే ఇండియాలో మన బిజినెస్‌ మీద ప్రభావం పడే అవకాశం ఉంటుందని.. అందువల్ల అలాంటి వారికి హేట్‌ స్పీచ్‌ రూల్స్‌ అమలు చేయవద్దని పేర్కొన్నట్లు ఈ కథనం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌... అధికార భాజపాపై విరుచుకుపడుతోంది. వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ఆధారంగా చేసుకునే రాహుల్‌ గాంధీ.. కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అలాగే, అధికార పక్షంపై మరింత ఒత్తిడి పెంచేందుకు, ఈ అంశాన్ని పార్లమెంటుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది కాంగ్రెస్‌.

కీలుబొమ్మలా మారితే..

దేశంలోని కోట్లాది మంది డేటా.. వారి చరవాణుల బ్రౌజింగ్‌ హిస్టరీ ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ల చేతిలో ఉంటుంది. ఈ పరిస్థితులల్లో.. సంస్థ గనక ఆధికార పార్టీ చేతిలో కీలుబొమ్మలా మారితే, పెను ప్రమాదమని, ఎన్నికలు ప్రభావితమయ్యే స్థాయిలో పరిస్థితులు ఉంటాయని కాంగ్రెస్‌ ఆరోపి స్తోంది. ఈ అంశంపై స్వతంత్ర విచారణ జరగాలని పట్టుబడుతోంది. ఇదే వి।షయంపై కాంగ్రెస్ సీనియర్ నేత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి నాయకత్వం వహిస్తున్న శశిథరూర్ మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు. హక్కులను పరిరక్షించడం, సామాజిక మాధ్యమాలు, ఆన్‌లైన్ న్యూస్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల దుర్వినియోగాన్ని నివారించడమనే అంశం పై సాక్ష్యాలు పరిశీలిస్తామన్నారు. దీనిపై గతంలో ఫేస్‌బుక్​కు నోటీసులిచ్చినట్టు గుర్తు చేశారు. పార్లమెంటరీ కమిటీ ముందు ఈ అంశాన్ని ఉంచనున్నట్లు ఆయనే వెల్లడించారు.

మాటల యుద్ధం..

అయితే రాహుల్‌గాంధీ ఆరోపణలపై కేంద్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఘాటుగా స్పందించారు. సొంతపార్టీలోని వ్యక్తులను కూడా అదుపులోకి పెట్టుకోలేని పరాజితులు ప్రపంచం మొత్తం భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రిస్తున్నాయనే ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు ముందు డేటాను ఆయుధంగా ఉపయోగించేందుకు కేంబ్రిడ్జ్‌ ఎనలిటికా, ఫేస్‌బుక్‌తో పొత్తు పెట్టుకున్న మీరు, ఇప్పుడు మాపై ఆరోపణలు చేస్తున్నారా అని మంత్రి... కాంగ్రెస్‌పై విరుచుకు పడ్డారు. సమాచారం, భావ ప్రకటనా స్వేచ్ఛ రెండు ప్రజాస్వామ్యంలో భాగం చేశామని. మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల చేతుల్లో వాటి నియంత్రణ లేకపోవడం అనేది మీకు బాధ కలిగిస్తోంది. బెంగళూరు అల్లర్లను ఖండిస్తూ మీరు ఇంత వరకు ప్రకటన చేయలేదు. అప్పుడు మీ ధైర్యం ఎక్కడ ఉందంటూ? వరస ట్వీట్లతో రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌లపై ఎదురు దాడికి దిగారు. ఇలా రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.

మున్ముందు ఎలా..

మొత్తంగా ఈ వివాదంతో ఫేస్‌బుక్‌ విద్వేషపూరిత పోస్ట్‌ల విషయంలో చిత్తశుద్ధి నిరూపించు కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ప్రచురించిన కథనంతో.. ఫేస్‌బుక్‌కు ఎంతో ఇబ్బంది కలిగించేవే. ఈ పరిస్థితుల్లో ఫేస్‌బుక్‌ వివరణ ఇచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, రాజకీయ దుమారం రేగడంతో... ఫేస్‌బుక్‌ మున్ముందు ఎలా వ్యవహరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.