ETV Bharat / city

ఇంద్రకీలాద్రిపై భూభౌతిక నిపుణుల బృందం పర్యటన - భూభౌతిక నిపుణుల బృందం తాజావార్తలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భూభౌతిక నిపుణుల బృందం పర్యటించింది. తరచూ కొండచరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో కొండపై ఎక్కడెక్కడ ఎలాంటి సాంకేతికత వాడాలనే విషయాలపై ఆలయ ఇంజనీరింగ్‌ సిబ్బంది, పాలకమండలికి పలు సూచనలు చేసింది.

ఇంద్రకీలాద్రిపై భూభౌతిక నిపుణుల బృందం పర్యటన

author img

By

Published : Nov 2, 2020, 4:39 PM IST

విజయవాడ ఇంద్రకీలాద్రిపై తరచుగా కొండచరియలు విరిగిపడుతున్న సంగతి తెలిసిందే. 2008లో నిపుణల బృందం పర్యటించి దేవస్థానానికి కొన్ని సూచనలు, సిఫార్సులు చేసింది. కానీ...సమస్య పూర్తిగా తొలిగిపోలేదు. నేడు మరోమారు భూభౌతిక నిపుణుల బృందం ఇంద్రకీలాద్రిని సందర్శించి.. కొండచరియల ప్రాంతాలను పరిశీలించారు.

రాష్ట్ర దేవాదాయశాఖ సాంకేతిక సలహాదారు కొండలరావు, ఐఐటీ చెన్నైకు చెందిన ప్రొఫెసర్‌ నరసింహారావు, ఐఐటీ కాన్పూర్‌ ప్రొఫెసర్‌ మాధవ్, బెంగళూరులోని ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌కు చెందిన ప్రొఫెసర్‌ శివకుమార్, జీఎస్‌ఐకు చెందిన నిపుణులతో కూడిన బృందం కొండపై ఎక్కడెక్కడ ఎలాంటి సాంకేతికత వాడాలనే విషయాలపై ఆలయ ఇంజనీరింగ్‌ సిబ్బంది, పాలకమండలికి పలు సూచనలు చేసింది.

ఇదీచదవండి

ఈ యంత్రంలో వేసి పీపీఈ కిట్లు వాడిందే...మళ్లీ వాడొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.