సీఎం జగన్ తన పట్టుదల, పంతం కోసం విద్యార్థులు, ఉపాధ్యాయుల జీవితాలతో ఆడుకుంటున్నారని మాజీమంత్రి, తెదేపా నేత జవహర్ ధ్వజమెత్తారు. విద్యార్థుల ప్రాణాలకు పరీక్ష పెట్టేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని మండిపడ్డారు. విద్యార్థుల ప్రాణాలు పోతే జగన్ తిరిగి తీసుకొస్తారా? అని ప్రశ్నించారు. నారా లోకేశ్ పరీక్షలు వాయిదా వేయాలని కోరినందుకే.. వినకూడదనే మూర్ఖత్వంతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహించారు. ముఖ్యమంత్రి తన పంతాన్ని నెగ్గించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. తాడేపల్లి రాజసౌధం ఆదేశాలు అమలు చేసే ఉత్సవ విగ్రహం మాత్రమే అని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: కొవిడ్ కమాండ్ కంట్రోల్ విధుల్లోకి జవహర్‌రెడ్డి