ETV Bharat / city

'సీఎం జగన్​ను ప్రశ్నించలేరు కానీ... చంద్రబాబును విమర్శిస్తారా'

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రిని ప్రశ్నించే ధైర్యం చేయరుకానీ.. చంద్రబాబును విమర్శిస్తారని జవహర్ ధ్వజమెత్తారు.

jawahar
జవహర్, మాజీమంత్రి
author img

By

Published : Nov 16, 2020, 3:51 PM IST

సీఎం జగన్​ను ప్రశ్నించాలంటే భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుకు భయమా అని మాజీమంత్రి జవహర్ నిలదీశారు. చంద్రబాబు గురించి తప్ప రాష్ట్రం గురించి ఏనాడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. చంద్రబాబును విమర్శిస్తే ప్రజలు హర్షించరని సోము వీర్రాజు గ్రహించాలని జవహర్‌ హితవు పలికారు.

సలాం కుటుంబానికి జరిగిన అన్యాయం నేరంగా కనిపించకపోవటం విడ్డూరమని విమర్శించారు. మైనారిటీలను కించపరచడం సోమువీర్రాజు నైజమా అని నిలదీశారు. రాష్ట్రానికి వరదలొస్తే బయటకు రాలేదని.. సునీల్ ధియోదర్ చెప్పే వరకు ఎర్రచందనంపై మాట్లాడలేదని దుయ్యబట్టారు.

ఇవీ చదవండి..

తెదేపా, వైకాపాలు మతపరమైన రాజకీయాలు చేస్తున్నాయి: సోము వీర్రాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.