పోలీస్ వ్యవస్థ జగన్రెడ్డి పార్టీ నేతల ఒత్తిడులకు తలవంచడంతో వారి ప్రతిష్టకు భంగం వాటిల్లుతోందని మాజీ మంత్రి జవాహర్ దుయ్యబట్టారు. ఇకనైనా వైకాపా ఒత్తిళ్లకు లొంగకుండా చట్టానికి పెద్దపీఠ వేస్తే.. వారి గౌరవం పెరుగుతుందన్నారు. ఫిర్యాదులు చేసే భక్తుల్ని, పౌరుల్ని, పత్రికల్ని, ప్రతిపక్షాల్ని బెదిరిస్తే ప్రతిష్ట పెరగదని హితవు పలికారు. హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవటం.., వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో నేరస్థుల్ని అరెస్టు చేస్తే పోలీసుల ప్రతిష్ట పెరుగుతుందన్నారు. దేవాలయాల దాడులు వెనుక ఉన్న అసలు దోషుల్ని బోనులో నిలబెడితే గౌరవం పెరుగుతుందని సూచించారు.
ఇవీ చూడండి...: కృష్ణా జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న కోడి పందాలు