CPM : ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమే...సీపీఎం రాజకీయ లక్ష్యం - cpm state secretary
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్రంలో సీపీఎం ముందుకు వెళ్తోందని ఆ పార్టీ నూతన కార్యవర్గం స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలతో వంచిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు రాజధానుల ఏర్పాటుకు తెచ్చిన బిల్లును వెనక్కి తీసుకున్న వైకాపా..మరోసారి బిల్లు తేవటం మంచిదికాదని స్పష్టం చేసింది. రాష్ట్ర మహాసభల్లో ఇప్పటికే స్పష్టంగా చెబుతూ అమరాతినే ఏకైక రాజధానిగా తీర్మానం చేశామంటున్న సీపీఎం రాష్ట్ర నూతన కార్యదర్శి బి. శ్రీనివాసరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.