ETV Bharat / city

లాక్​డౌన్​ నేపథ్యంలో పేదలకు తోడుగా దాతలు - ap lock down latest news

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్​డౌన్​ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పేదలకు నిత్యావసరాలు అందించేందుకు పలువురు దాతలతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. పనులు లేక ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు చేయూతనిస్తున్నాయి.

లాక్​డౌన్​ నేపథ్యంలో పేదలకు తోడుగా దాతలు

author img

By

Published : Apr 8, 2020, 6:48 PM IST

రాష్ట్రంలో లాక్​డౌన్​ కొనసాగుతున్న నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్న నిరుపేదలకు చేయూత ఇచ్చేందుకు పలువురు దాతలు ముందుకొచ్చారు.

మంత్రి ఆదేశాల మేరకు పేదలకు కూరగాయల పంపిణీ
లాక్​డౌన్​ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి గౌతమ్ రెడ్డి ఆదేశాల మేరకు వైకాపా నాయకులు పేదలకు భారీగా కూరగాయలు పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా ఏఎస్​.పేట మండలం గుండ్లపాడు గ్రామంలో ఐటీ శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఆకలితో అలమటిస్తున్న పేదవారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

75 మంది కళాకారులకు నిత్యావసరాలు పంపిణీ
నెల్లూరు శివాజీ యూత్ ఫౌండేషన్, స్టెపప్ ఈవెంట్స్​ల ఆధ్వర్యంలో నగరంలోని 75 మంది కళాకారులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు అందరూ జాగ్రత్తలు పాటించాలని నెల్లూరు కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ మొక్కల ద్వారకనాథ్ పిలుపునిచ్చారు.

మాస్కులు పంపిణీ చేసిన అనకాపల్లి ఎంపీ
విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్య, శానిటేషన్ సిబ్బందికి అనకాపల్లి ఎంపీ డాక్టర్.బీవీ సత్యవతి మాస్కులు పంపిణీ చేశారు. స్థానిక 'వివేకానంద చారిటబుల్ ట్రస్ట్' ఆధ్వర్యంలో 'వరల్డ్ హెల్త్ డే' సందర్భంగా ఈ సేవ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

పారిశుద్ధ్య కార్మికులకు సత్కారం
కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా నిత్యం గ్రామాల్లో పరిశుభ్రంగా ఉంచేలా కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను వైకాపా నాయకులు, గ్రామ సచివాలయ సిబ్బంది ఘనంగా సత్కరించారు. తూర్పుగోదావరి జిల్లా రామవరంలో అనపర్తి ఈవోపీఆర్డీ నందన, వైకాపా జిల్లా అధికార ప్రతినిధి కృష్ణా రెడ్డి, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు కలిసి పారిశుద్ధ్య కార్మికులకు పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు.

ఇంటింటికి తిరిగి కూరగాయలు పంచిన మాజీ ఎమ్మెల్యే
లాక్​డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా వడిశలేరు గ్రామంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ ప్రజల ఆరోగ్య పరిస్థితులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.

జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్​ చేయూత
శ్రీకాకుళం జిల్లా రాజాంలో 'జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్​' ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. పీఏసీ చైర్మన్ అన్నం నాయుడు, జనరల్ మేనేజర్ జై కుమార్, ట్రైనింగ్ డీఎస్పీ శ్రీలత చేతుల మీదగా రాజాం పట్టణంలో వందమంది పేద కుటుంబాలకు బియ్యంతో పాటు 13 రకాల నిత్యావసర వస్తువులను అందజేశారు.

పోలీస్​ సిబ్బందికి మాస్కులు పంపిణీ
అనంతపురం జిల్లా హిందూపురంలో రెడ్​జోన్​గా ఉన్న హౌసింగ్ బోర్డ్ కాలనీ, దంకా స్ట్రీట్, ముక్కిడిపేట ప్రాంతాలలో ఐజీ సంజయ్ పర్యటించారు. కర్ణాటక-ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన తూముకుంట చెక్​పోస్ట్​ వద్ద భద్రతా చర్యలను పర్యవేక్షించారు. అనంతరం హిందూపురం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్​లో సిబ్బందికి శానిటైజర్ల, మాస్కులు పంపిణీ చేశారు.

ఇదీ చూడండి: కూరగాయల మార్కెట్​కి వెళ్లేవారిపై ద్రావణం పిచికారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.