ETV Bharat / city

PAYYAVULA: సెకి సోలార్ టెండర్ల వ్యవహారంలో ఏపీఈఆర్సీని సంప్రదిస్తాం..: పయ్యావుల కేశవ్

సెకి సోలార్ టెండర్ల వ్యవహారంలో ఏపీఈఆర్సీని సంప్రదించాలని ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ నిర్ణయించారు. అందుకోసం సమయం కోరగా.. ఈఆర్సీ ఛైర్మన్ నెల్లూరు పర్యటనలో ఉన్నట్లు ఆ సంస్థ అధికారులు తెలిపారు.

PAYYAVULA
PAYYAVULA
author img

By

Published : Nov 8, 2021, 4:54 PM IST

సెకి సోలార్ టెండర్ల వ్యవహరంలో ఏపీఈఆర్సీని సంప్రదించాలని ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ నిర్ణయించారు. ఈ మేరకు ఈఆర్సీ ఛైర్మన్ సమయం కోరారు. కానీ ఈఆర్సీ ఛైర్మన్ నెల్లూరు పర్యటనలో ఉన్నారని.. ఆయన కార్యాలయవర్గాలు కేశవ్​కు సమాచారం అందించాయి. తక్కువ ధరకే సెకీ విద్యుత్ లభ్యమవుతున్నా.. రూ. 2.49కే కొనుగోలు చేయడం దేనికంటూ గత కొద్దిరోజులుగా వరుస మీడియా సమావేశాల ద్వారా పయ్యావుల కేశవ్ ప్రశ్నిస్తున్నారు.

సోలార్ విద్యుత్ కొనుగోళ్లపై పయ్యావుల ఏమన్నారంటే..

యూనిట్‌ విద్యుత్‌ రూ.2.49 చొప్పున తొమ్మిది వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కొనేందుకు సెకితో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం... ముమ్మాటికీ రాష్ట్ర ప్రజల కష్టాన్ని అదానీకి దోచిపెట్టేందుకేనని తెదేపా సీనియర్‌ నేత, ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ధ్వజమెత్తారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ ఒప్పందంలో అవకతవకలను తాను ఎత్తిచూపితే, ప్రభుత్వం వాటికి సమాధానం చెప్పకుండా, ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేరుతో ఒక ప్రకటన విడుదల చేసి ప్రజలను మోసం చేయాలనుకుందని మండిపడ్డారు. ‘‘నేను లేవనెత్తిన అంశాలకు ఎక్కడా సూటిగా, స్పష్టంగా సమాధానం ఇవ్వకుండా, సంబంధంలేని అంశాల్ని ప్రస్తావిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే తప్పుదోవ పట్టించింది. మంత్రి బాలినేనికైనా వాస్తవాలు తెలుసా?’’ అని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వ ప్రకటనలో పేర్కొన్న అంశాల్ని ప్రస్తావిస్తూ, ఆయన మరిన్ని ప్రశ్నలు సంధించారు.

అవి..!

  • యూనిట్‌కి రూ.2.49 చౌక ధర అని, అది సెకి ‘డిస్కవర్డ్‌’ ప్రైస్‌ అని ప్రభుత్వం చెబుతోంది. సెకి ఖరారు చేసిన 30-40 టెండర్లను పరిశీలిస్తే.. యూనిట్‌ రూ.1.99, రూ.2, రూ.2.01, రూ.2.20... అలా తక్కువ ధరకు ఖరారైనవి ఉన్నాయి. యూనిట్‌ రూ.1.99కి దొరుకుతుంటే... రూ.2.49కి కొనడం చౌకా? సెకి 22 నెలల క్రితం పిలిచిన టెండర్లలో అదానీ సంస్థ యూనిట్‌ రూ.2.93కి కోట్‌ చేసింది. పక్కవాడు యూనిట్‌ రూ.2కే అమ్ముతుంటే... అదానీ రూ.2.93కి కోట్‌ చేసి, ఏదో ఆషాఢం డిస్కౌంట్‌ సేల్‌లా ధర తగ్గించి రూ.2.49కే ఇస్తున్నానంటే ప్రభుత్వం కొనేయడం, డిస్కౌంట్‌లో కొన్నామని సంబరాలు చేసుకోవడం వినేవాళ్ల చెవిలో పువ్వులు పెట్టడం కాదా?
  • అదానీ నుంచి కొనుగోలు చేసే విద్యుత్‌ యూనిట్‌ రూ.2.49 కూడా కాదని, దొడ్డిదారిన చాలా ఛార్జీలు చేర్చారని, అది రూ.3.50 నుంచి రూ.4.50 అవుతుందని సవాల్‌ చేశాను. దానికి బదులేది?
  • మన రాష్ట్రంలో ప్లాంట్లు పెట్టడం కంటే, ఇతర రాష్ట్రాల్లో పెట్టిన ప్లాంట్ల నుంచి కొనడం చౌక అని, విద్యుత్‌ ఉత్తరం నుంచి దక్షిణానికి వస్తుందని, కేంద్రం ఐఎస్‌టీఎస్‌ ఛార్జీల్లో వెసులుబాటు ఇచ్చిందని ప్రభుత్వం చెప్పింది. ఇదెక్కడి విచిత్రం. నీరు పల్లమెరుగు అన్నట్టు... విద్యుత్‌ ఉత్తరం నుంచి దక్షిణానికే ప్రవహిస్తుందా? కేంద్రం ఐఎస్‌టీఎస్‌ ఛార్జీల్లో మినహాయింపును 2022 డిసెంబరు వరకే పొడిగించింది. ఆలోగా మొదలయ్యే ప్రాజెక్టులకే వెసులుబాటు వర్తిస్తుంది. మీరు అదానీ ప్లాంట్‌ నుంచి 2024లో విద్యుత్‌ కొంటామని చెబుతున్నారు. దానికి ఐఎస్‌టీఎస్‌ వర్తించదు కదా? అప్పుడు యూనిట్‌కి రూ.1.50 అదనంగా చెల్లించాల్సిందే కదా?
  • ఐఎస్‌టీఎస్‌ వెసులుబాటు వర్తించినా అది ఉచితమేమీ కాదు. దాన్ని సోషలైజేషన్‌ ఛార్జీల పేరుతో రాష్ట్రాలు మరో రూపంలో భరించాలి. సోషలైజేషన్‌, ఇంక్రిమెంటల్‌ ఛార్జీలు, ప్రసార నష్టాలు కలిపి యూనిట్‌కి రూ.1 అదనంగా చెల్లించాలి. కస్టమ్స్‌ డ్యూటీ పాస్‌ ఓవర్‌ ఛార్జీలు వంటివీ కలిపి యూనిట్‌ రూ.4.50కి చేరుతుంది.
  • 6,050 మెగావాట్ల సోలార్‌ పార్కులకు సంవత్సరం క్రితం టెండర్లు పిలిచినప్పుడు న్యాయసమీక్ష కమిటీకి ఇచ్చిన నివేదికలో... రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న ప్రసార వ్యవస్థ సామర్థ్యాన్ని పెద్దగా ఖర్చేమీ లేకుండానే పెంచుతామని, అది సరిపోతుందని ప్రభుత్వం పేర్కొంది. సోలార్‌పార్కుల ఏర్పాటుకి భూములూ, ట్రాన్స్‌మిషన్‌ లైన్లూ చంద్రబాబు హయాంలోనే సిద్ధం చేశారు. అంత వ్యవస్థ ఉన్నప్పుడు పొరుగు రాష్ట్రాల నుంచి విద్యుత్‌ కొనాల్సిన అవసరం ఏంటి? రాష్ట్రంలో ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తే విద్యుత్‌... తమిళనాడు, కర్ణాటకలకు వెళ్లి ఆంధ్రప్రదేశ్‌కి రావాలని ప్రభుత్వం కథలు చెబుతోంది.
  • రాష్ట్ర ప్రభుత్వం గతంలో బిల్డ్‌ ఓన్‌ ఆపరేట్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ (బూట్‌) విధానంలో టెండర్లు పిలిచింది. అప్పుడు ఇదే అదానీ సంస్థ యూనిట్‌కి రూ.2.49 కోట్‌ చేస్తూ టెండరు వేసింది. గడువు ముగిశాక ప్రాజెక్టుని మీకే అప్పగించిపోతానని అదానీ చెప్పారు. ఇప్పుడు సెకితో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం... అదానీ సంస్థ బిల్డ్‌ ఓన్‌ అండ్‌ ఆపరేట్‌ (బూ) విధానంలో రాజస్థాన్‌లో ప్రాజెక్టు నెలకొల్పుతామంటోంది. ‘బూ...’ విధానంలో డబ్బులు రాష్ట్రానివి... ప్రాజెక్టు అదానీది. గతంలో పిలిచింది బూట్‌ మోడల్‌ అయితే... ఇది లూట్‌ (దోపిడీ) మోడల్‌.
  • సౌర విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేసి, ఉత్పత్తి ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువు 18 నెలలు. కానీ అదానీ సంస్థ 2024లో ఉత్పత్తి ప్రారంభిస్తామంటోంది. అంత గడువు ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు రూ.1.99 ఉన్న యూనిట్‌ విద్యుత్‌... 2024లో రూ.1.26కే దొరుకుతుందని అధ్యయనాలు చెబుతున్నప్పుడు మీరు యూనిట్‌ రూ.4.50కి కొని ఎవరిపై భారం వేయాలనుకుంటున్నారు?

అదానీలపై అంత ప్రేమేంటి?

‘అదానీపై అంత ప్రేమ ఎందుకు? టాటాలపై అంత ద్వేషం ఎందుకు? అదానీకే కట్టబెట్టేందుకు టైలర్‌మేడ్‌ టెండర్లు ఎందుకు పిలుస్తున్నారు? ఆ ప్రేమేదో ప్రజలపై చూపండి...’ అని పయ్యావుల పేర్కొన్నారు.

‘‘సెకితో ఒప్పందానికి రాష్ట్ర ప్రభుత్వం ఏపీఈఆర్‌సీ అనుమతి కోరలేదు. ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో... విద్యుత్‌ ధరను ఏపీఈఆర్‌సీ నిర్ణయిస్తుందని చెప్పారు. అప్పుడు యూనిట్‌ రూ.2.49కి కొనడానికి కేబినెట్‌ నిర్ణయం ఎందుకు తీసుకుంది?..’ అని పయ్యావుల ప్రశ్నించారు.

ఇదీ చదవండి: Minister Buggana:'పెట్రో ధరలపై కేంద్రం తీసుకున్నంత సులభంగా నిర్ణయం తీసుకోలేం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.