దేవాదాయశాఖలో మూడవ శ్రేణి కార్యనిర్వహణ అధికారుల నియామకంపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని ఆ శాఖ ఉద్యోగులు పేర్కొన్నారు. అలాంటి అసత్య ప్రచారాన్ని నమ్మోద్దని.. వాటిని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు దేవాదాయశాఖ 3వ శ్రేణి ఉద్యోగులు మీడియా సమావేశం నిర్వహించారు. ఉద్యోగాలు కోసం మేము ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.. తప్పుడు ప్రచారం చేస్తూ మమ్ముల్ని మానసిక క్షోభకు గురిచేయోద్దని దేవాదాయశాఖ ఉద్యోగుల అసోషియేషన్ తరపున కోరారు.
3వ శ్రేణి కార్యనిర్వహణ అధికారుల నియామకాలు చేపట్టొదంటూ.. వేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసిన నేపథ్యంలో తక్షణమే పోస్టుల భర్తీతో పాటు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్క కార్యనిర్వాహణాధికారి.. సుమారు 30 ఏళ్లుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అతి తక్కువ వేతనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.
ఇదీ చదవండి: ABV: 'వారిపై పరువు నష్టం దావా వేస్తా.. అనుమతివ్వండి'