ETV Bharat / city

పోరాటానికి ప్రభుత్వ వైఖరే కారణం.. ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి సమ్మె: ఉద్యోగ సంఘాలు

author img

By

Published : Jan 30, 2022, 4:32 PM IST

పీఆర్సీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉద్యోగుల పోరాటానికి ప్రభుత్వ వైఖరే కారణమని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. మెరుగైన వేతన సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ సంఘాలన్నీ ఒకే వేదికపైకి వచ్చి ఉద్యమిస్తున్నాయన్నారు. కొత్త పీఆర్సీ వల్ల ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని వాపోయారు. ఉద్యోగ సంఘాలు ఏకమై ఉద్యమ కార్యాచరణ రూపొందించాయని..,ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగబోతున్నట్లు స్పష్టం చేశారు.

ఉద్యోగుల పోరాటానికి ప్రభుత్వ వైఖరే కారణం

పీఆర్సీ జీవోలు రద్దు చేయడం సహా మెరుగైన వేతన సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. విజయవాడ గాంధీనగర్‌లోని ధర్నాచౌక్‌లో నాలుగో రోజు ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలకు దిగారు. పెద్దఎత్తున ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు, పెన్షనర్లు దీక్షలో పాల్గొన్నారు. పీఆర్సీ సాధన సమితి ముఖ్యనేత సూర్యనారాయణ సహా పలువురు స్టీరింగ్ కమిటీ సభ్యులు దీక్షాస్థలికి వచ్చి సంఘీభావం ప్రకటించారు. ఫిబ్రవరి 3న తలపెట్టిన చలో విజయవాడ సభను బీఆర్టీఎస్ రోడ్డులో నిర్వహించనున్నట్లు ఐకాస నేత విద్యాసాగర్ తెలిపారు.

రాష్ట్రంలో ఇదే తొలిసారి..

ఉద్యోగుల జీతాలు తరిగే విధానాన్ని రాష్ట్రంలో తొలిసారి చూస్తున్నామని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.సూర్యనారాయణ అన్నారు. కొత్త పీఆర్సీ వల్ల ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని, ఉద్యోగుల పోరాటానికి ప్రభుత్వ వైఖరే కారణమని అన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 6న అర్ధరాత్రి నుంచి ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారని ప్రకటించారు.

జీతాలు తరిగే విధానాన్ని రాష్ట్రంలో తొలిసారి చూస్తున్నాం. ఉద్యోగ సంఘాలన్నీ ఒకే వేదికపైకి వచ్చి ఉద్యమిస్తున్నాయి. కొత్త పీఆర్సీ వల్ల ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఉద్యోగ సంఘాలు ఏకమై ఉద్యమ కార్యాచరణ రూపొందించాయి. ఉద్యోగుల పోరాటానికి ప్రభుత్వ వైఖరే కారణం. ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. -సూర్యనారాయణ, ఉద్యోగ సంఘం నేత

ప్రభుత్వం దిగొచ్చే వరకు ఉద్యమం ఆగదు..

ప్రభుత్వం దిగొచ్చే వరకు ఉద్యోగుల ఉద్యమం కొనసాగుతుందని ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. శ్రీకాకుళంలో ఉద్యోగులు చేస్తున్న నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఉద్యమాన్ని నీరుకార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న బొప్పరాజు..ఉద్యోగులు ఐక్యంగా ఉన్నన్నాళ్లు ప్రభుత్వం ఏమీచేయలేదన్నారు. పీఆర్సీ నివేదిక బయటపెట్టాలని బొప్పరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఉమ్మడి కార్యాచరణలో భాగంగా 13 జిల్లాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. 4 జేఏసీలు న్యాయమైన ధర్మ పోరాటం చేస్తున్నాయి. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలి. ఉద్యమాన్ని నీరు కార్చేందుకు ప్రభుత్వం యత్నం. -బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్

ఇంత తక్కువ వేతనాలు న్యాయమేనా..?

కొత్త పీఆర్సీ వల్ల ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలులో చేపట్టిన ఉద్యోగులు ఆందోళనల్లో జేఏసీ నేత హృదయరాజుతో పాటు వెంకట్రామిరెడ్డి పాల్గొని మాట్లాడారు. అశుతోష్‌ మిశ్రా కమిటీ నివేదిక బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. అప్పుడే తాము చర్చలకు వస్తామని స్పష్టం చేశారు.

పీఆర్సీ వల్ల ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఆఫీసర్స్‌ కమిటీ 30 శాతం జీతాలు పెంచాలని సిఫారసు చేసింది. కమిటీ సిఫారసులు పక్కనపెట్టి 23 శాతమే ఇస్తామంటున్నారు. ఉద్యోగులకు ఇంత తక్కువ వేతనాలు ఇవ్వడం న్యాయమేనా ?. పొరుగు సేవల సిబ్బందికి కనీస వేతనాలు ఇవ్వాలని కోరాం. ఉద్యోగులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. -వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

జగన్ రాజకీయ నిర్ణయం తీసుకోవాలి..

ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యపై ముఖ్యమంత్రి జగన్ రాజకీయ నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాలతో సీఎం నేరుగా మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. మెరుగైన వేతన సవరణ డిమాండ్ చేస్తూ..గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ సంఘాలు నిర్వహించిన రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ సంఘీభావం తెలిపారు. ఎస్మా ప్రయోగంలాంటి అర్థం లేని చర్యలను ప్రభుత్వం విరమించుకోవాలని ప్యాఫ్టో ఛైర్మన్ జోసెఫ్ సుధీర్ బాబు ప్రభుత్వానికి సూచించారు.

ఇదీ చదవండి

PRC: పీఆర్సీ సమ్మెలో పాల్గొనబోం:ఆర్టీసీ వైయస్సార్‌ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు చంద్రయ్య

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.