ETV Bharat / city

ప్రభుత్వ తీరులో ఏదో లోపం ఉంది: ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ - ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ

ప్రభుత్వానికి ఉద్యోగుల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించడం లేదని.. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ మండిపడ్డారు. ఉద్యోగ సంఘానికి నాయకత్వం పూలపాన్పు కాదని విమర్శించారు. ఇటీవల పీఆర్సీ సందర్భంగా జరిగిన పరిణామాలను చూస్తే.. ప్రభుత్వ వ్యవహార శైలిలోనే లోపం ఉన్నట్లు కనిపిస్తోందని అన్నారు.

employees shows dissatisfaction towards government
ప్రభుత్వ తీరులో ఏదో లోపం ఉంది
author img

By

Published : Jun 10, 2022, 8:28 AM IST

‘ఇటీవల పీఆర్సీ సందర్భంగా జరిగిన పరిణామాలను చూస్తే.. ప్రభుత్వ వ్యవహార శైలిలోనే లోపం ఉన్నట్లు కనిపిస్తోంది. ఉద్యోగుల విషయంలో ఇంత అల్లరి, అప్రతిష్ఠ పాలు కావాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకత్వం కాకుండా, సీఎస్‌ నేతృత్వంలోని ఐఏఎస్‌లు మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడడం దారుణం. వారు ఉద్యోగులను రెచ్చగొట్టారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి’ అని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు.

విజయవాడలో గురువారం సంఘం రెండో కౌన్సిల్‌ సమావేశం జరిగింది. 23 మందితో రాష్ట్ర కార్యవర్గం కొలువుదీరింది. అధ్యక్షుడిగా కేఆర్‌ సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా ఆస్కారరావు ఎన్నికయ్యారు. సూర్యనారాయణ మాట్లాడుతూ ‘ప్రభుత్వానికి ఉద్యోగుల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించడం లేదు. ఉద్యోగ సంఘానికి నాయకత్వం పూలపాన్పు కాదు. గుమ్మాల వద్ద నిలబడి బొకేలు ఇచ్చి ఫొటోలు దిగే ప్రస్తుత ఉద్యోగ సంఘాల నేతల సంస్కృతికి తలొగ్గలేకపోతున్నా.

చాలాకాలం తర్వాత జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేయించి నేను మాట్లాడుతుంటే.. బండి శ్రీనివాస్‌, బొప్పరాజు అడ్డుతగిలారు. ఉద్యోగ సంఘాలు ఇలాంటి దౌర్భాగ్య స్థితికి వచ్చాయి. ఈ నేతలతో పీఆర్సీ ఎలా సాధించగలమో ఉద్యోగులు తేల్చుకోవాలి. సాధారణ బదిలీల విషయంలో ఇటీవల వచ్చిన జీవోపై స్పష్టత కొరవడింది. ఈ విషయంలో ప్రభుత్వం సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది.

ఆదాయమంతా జీతాలకే: అజేయ కల్లం
‘ఉద్యోగులు కోరుకుంటే ఏర్పడిన ప్రభుత్వం ఇది. రెండు దశాబ్దాలుగా వ్యవస్థలు బలహీనపడ్డాయి. దీనికి ప్రజాప్రతినిధులతోపాటు మనం కూడా బాధ్యులమే. ఉద్యోగుల విషయంలో సీఎం సానుకూలంగానే ఉంటారు. సూర్యనారాయణ ఉద్యోగ జీవితం దాటి ప్రజాజీవితంలోకి రావాలని కోరుకుంటున్నా. ఈ ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్రంలో దాదాపు రూ.40 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు ఉన్నాయి. దీనివల్ల ఆర్థికంగా సమస్యలు ఎదురవుతున్నాయి. తర్వాత రెండేళ్లలో కొవిడ్‌ కారణంగా ఆదాయం తగ్గి.. జీతాలకే సరిపోతోంది. రెండేళ్లలో సాధారణ పరిస్థితులు ఏర్పడవచ్చు. అప్పటికి ఉద్యోగుల డిమాండ్లు తీర్చడానికి కొంత వెసులుబాటు వస్తుంది.’

కనీసం మాస్కులు ఇవ్వలేదు: ఆస్కారరావు, సంఘం ప్రధాన కార్యదర్శి

కరోనా సమయంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశారు. వారికి కనీసం మాస్కులు, గ్లౌజులు కూడా ఇవ్వలేదు. పీఆర్సీ విషయంలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. గత ప్రభుత్వ హయాంలో పోరాడి బయోమెట్రిక్‌ హాజరు తీసి వేయిస్తే ఇప్పుడు మళ్లీ తెచ్చారు. దీంతో ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రేపటి నుంచి సమస్యల ప్రాతిపదికన ఐఏఎస్‌ల ఛాంబర్ల ముందు బైఠాయింపు, ధర్నాలు చేపట్టాలని తీర్మానించారు.

మహిళా విభాగం ఏర్పాటు.. ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి అనుబంధంగా 11 మంది మహిళా ఉద్యోగులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి వీఎంఆర్డీఏలో ముఖ్య గణాంక అధికారిగా పనిచేస్తున్న నిర్మలమ్మ నేతృత్వం వహించనున్నట్లు ప్రకటించారు.

ఇవీ చూడండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.