విద్యుత్ సంస్థను ప్రైవేటీకరించే చర్యలను విరమించుకోవాలని.. విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ప్రజలపై భారం పెంచి, సిబ్బంది హక్కులు హరించే.. 'విద్యుత్ సవరణల బిల్లు 2020'ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన సమయంలో.. సీపీడీసీఎల్ సీఎండీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. 'ఏపీ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ కమిటీ' పిలుపు మేరకు.. అక్టోబర్ 19వ తేదీ నుంచి వివిధ రకాలుగా సిబ్బంది ఆందోళనలు చేస్తున్నారు.
ప్రభుత్వం హామీ ప్రకారం ఈపీఎఫ్ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని నినాదాలు చేశారు. కరోనా సోకిన సిబ్బందికి 50 లక్షల రూపాయల భీమా సౌకర్యం కల్పించాలన్నారు. జనవరి, జులై డీఏలతో పాటు ఆ రెండు మాసాల సగం వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులందరికీ అపరిమితమైన వైద్యసౌకర్యం అమలు చేయాలని కోరారు. ఆర్టీపీపీలలో విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించాలన్నారు.
ఇదీ చదవండి: హోటల్ నిర్వాకం..బూజు పట్టిన హల్వా, నిల్వ చేసిన మాంసం