సోమవారం సాయంత్రం విజయవాడలోని విద్యుత్ సౌధలో ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్, ఇతర అధికారులతో కలిసి చర్చలు జరిగిన అనంతరం ఉద్యోగుల ఐకాస ఛైర్మన్ చంద్రశేఖర్, కన్వీనర్ సాయికృష్ణ, సెక్రటరీ జనరల్ వేదవ్యాస్ ఆందోళన కార్యక్రమాలు విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఇవాళ సాయంత్రం మంత్రి శ్రీనివాస రెడ్డికి చర్చల సారాంశాన్ని అధికారులు వివరించి... రాత పూర్వకంగా సమాధానం ఇస్తారని తెలిపారు. డిమాండ్లను నిర్దేశిత వ్యవధిలో పరిష్కరించకపోతే మళ్లీ నిరసనకు పిలుపునిస్తామని ఐకాస నేతలు తెలిపారు.
ఆందోళన విరమించినట్లు విద్యుత్ ఉద్యోగుల ఐకాస ప్రకటన - ఆందోళన విరమించిన విద్యుత్ ఉద్యోగుల సంఘం తాజా వార్తలు
డిమాండ్ల పరిష్కారానికి విద్యుత్ ఉద్యోగులు వివిధ రూపాల్లో చేపట్టిన ఆందోళన కార్యక్రమాలను విరమిస్తున్నట్లు ఐకాస నేతలు ప్రకటించారు.