ETV Bharat / city

ఈనాడు కథల పోటీకి ఆహ్వానం

author img

By

Published : Sep 30, 2020, 11:15 PM IST

Updated : Sep 30, 2020, 11:31 PM IST

తెలుగు వెలుగు, బాల భారతం, విపుల, చతుర మాసపత్రికల ద్వారా తెలుగు భాషకు, సాహిత్యానికి పట్టం కడుతున్న ఈనాడు, రామోజీ ఫౌండేషన్‌ సంస్థలు.. రచయితల్ని ప్రోత్సహించేందుకు 'కథా విజయం' పేరుతో కథల పోటీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది పోటీకి రచనలను ఆహ్వానిస్తోంది.

eenadu katha vijayam competition 2020
eenadu katha vijayam competition 2020

గతేడాది పోటీకి అనూహ్య స్పందన వచ్చింది. నాలుగు విదేశాలు, 12 తెలుగేతర రాష్ట్రాల నుంచి దాదాపు 2 వేల కథలు వచ్చాయి. 18 నుంచి 90 ఏళ్ల వరకూ అన్ని వయోవర్గాల వారూ కథలను పంపారు. సుప్రసిద్ధ రచయితలు, సాహితీ విమర్శకులతో కూడిన న్యాయనిర్ణేతల బృందం అంతిమ విజేతలను ఎంపిక చేసింది.

ఈ పోటీలో బహుమతులు పొందిన కథలు ‘ఈనాడు ఆదివారం’, ‘తెలుగు వెలుగు’, ‘విపుల’, ‘చతుర’ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఈ ఒరవడిని కొనసాగిస్తూ రామోజీ ఫౌండేషన్‌ 'కథా విజయం-2020' పోటీకి రచనలను ఆహ్వానిస్తోంది. ఈ పోటీలో 31 మంది విజేతలకు రూ.1 లక్షా 70 వేల విలువైన బహుమతులు అందుతాయి. వివరాలు, పోటీ నిబంధనలను teluguvelugu.inలో చూడవచ్చు.

Last Updated : Sep 30, 2020, 11:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.