ETV Bharat / city

తెలంగాణలో మరో 50 కరోనా పాజిటివ్‌ కేసులు

author img

By

Published : Apr 16, 2020, 6:55 PM IST

తెలంగాణలో మరో 50 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న 68 మందిని డిశ్చార్జ్‌ చేస్తున్నామన్నారు. చికిత్సపొందుతున్న వారిలో ఎవరి పరిస్థితి విషమంగా లేదని పేర్కొన్నారు. ముగ్గురు రోగులు వెంటిలేటర్‌పై ఉన్నారని చెప్పారు. గచ్చిబౌలి ఆస్పత్రిని 1500 పడకల స్థాయికి తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఈనెల 20న ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

eatala-rajendhar-review-on-hospitals-facilities-in-telangana

తెలంగాణలోని అన్ని ల్యాబ్‌ల సామర్థ్యం రెట్టింపు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. హైదరాబాద్‌లో మరో రెండు ల్యాబ్‌లకు అనుమతి వచ్చిందని వెల్లడించారు. సనత్‌నగర్‌, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల్లో ఈనెల 18 నుంచి వైద్య పరీక్షలు చేస్తామని పేర్కొన్నారు. ప్రతిరోజూ 5 వేల పరీక్షలు చేసే సామర్థ్యం సమకూరిందని వివరించారు. ఆస్పత్రుల్లో రోగులకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నామని తెలిపారు. గాంధీ, చెస్ట్‌, కింగ్‌ కోఠి ఆస్పత్రుల్లో సౌకర్యాలపై మంత్రి సమీక్షించారు.

మర్కజ్‌ నుంచి వచ్చిన ఆరుగురి నుంచి 81 మందికి కరోనా సోకింది. మర్కజ్‌ నుంచి వెళ్లి వచ్చినవారు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. గాంధీలో పిల్లలు, మహిళల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేస్తున్నాం. కరోనా సోకినవారు గాంధీలో చికిత్సపొంది కోలుకుని వెళ్తున్నారు. హైదరాబాద్‌లో రోజూ 3 లక్షల మాస్కులు తయారవుతున్నాయి. గ్రామాల్లో మహిళా సంఘాలు లక్షల సంఖ్యలో మాస్కులు తయారు చేస్తున్నాయి.

- తెలంగాణ మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.