రాష్ట్రంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ‘ఏపీ ఈఏపీసెట్’(EAPCET) ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడ ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో.. మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంజినీరింగ్()Engineering results ఫలితాలను విడుదల చేశారు. ఈనెల 14న వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల ఫలితాలు వెల్లడించనున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,34,205 (80.62శాతం) మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. రేపటి నుంచి ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థి పేరు | ర్యాంకు | జిల్లా |
నిఖిల్ | మొదటి(1) ర్యాంకు | అనంతపురం |
వరదా మహంతనాయుడు | రెండో (2) ర్యాంకు | శ్రీకాకుళం |
వెంకట ఫణీష్ | నాలుగో (4) ర్యాంకు | కడప |
దివాకర్ సాయి | నాలుగో (4) ర్యాంకు | విజయనగరం |
మౌర్యా రెడ్డి | ఐదో (5) ర్యాంకు | నెల్లూరు |
శశాంక్‌రెడ్డి | ఆరో (6) ర్యాంకు | ప్రకాశం |
ప్రణయ్ | ఏడో (7) ర్యాంకు | విజయనగరం |
హర్ష వర్మ | ఎనిమిదో (8) ర్యాంకు | విజయవాడ |
కార్తికేయ | తొమ్మిదో (9) ర్యాంకు | పశ్చిమగోదావరి |
ఓరుగంటి నివాస్ | పదో (10) ర్యాంకు | చిత్తూరు |
తొలుత ఇంజినీరింగ్ (ఎంపీసీ స్ట్రీమ్), ఆ తర్వాత వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలు నిర్వహించనున్నారు. ఎంపీసీ స్ట్రీమ్‌కు 1,76,603మంది దరఖాస్తు చేయగా.. 1,66,460మంది హాజరయ్యారు. పరీక్ష రాసిన వారిలో అయిదుగురు కొవిడ్ బారినపడ్డారని.. వారికి మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.
తల్లిదండ్రుల సహకారం, కళాశాల సిబ్బంది ప్రోత్సాహంతోనే.. ఉన్నత ర్యాంకులు సాధించామని ఈఏపీసెట్ ర్యాంకర్లు తెలిపారు.
అసైన్మెంట్స్ ఎంతో ఉపయోగపడ్డాయి
మా తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులే. వారు నాకు అన్ని విషయాల్లో సహకారం అందించారు. మా ఉపాధ్యాయులు సైతం నాకు చాలా సహాయపడ్డారు. నాకు మంచి ర్యాంకు రావటానికి గల కారణం వారు ఇచ్చిన అసైన్మెంట్స్. రానున్న ఐఐటీ అడ్వాన్స్డ్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి.. ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చేయాలనుకుంటున్నా. - శ్రీ నిఖిల్, ఈఏపీసెట్ మొదటి ర్యాంకు విద్యార్థి
శ్రీనిఖిల్ ఉన్నతస్థాయికి ఎదగాలి
రాష్ట్రంలో వెలువడిన ఏపీఈసెట్ ఫలితాల్లో.. అనంతపురం జిల్లా కొడిగెనహళ్లికు చెందిన శ్రీ నిఖిల్ మొదటి ర్యాంకు సాధించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
తమ కుమారుడికి ఏపీఈసెట్ లో మొదటి ర్యాంకు రావటం చాలా చాలా ఆనందంగా ఉందని తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, సుజాత అన్నారు. శ్రీ నిఖిల్ చిన్నతనం నుంచే ఏకసంతాగ్రహి. భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. ఐఐటీ అడ్వాన్స్డ్ పరీక్షలో మంచి ర్యాంకు రావాలని ఆశిస్తున్నాం. - శ్రీ నిఖిల్ తల్లిదండ్రులు
ఐఐటీ బాంబేలో చేరతాను..
మా తల్లిదండ్రులు నాకు ఎప్పుడు సహాయపడతారు. ఏపీఈసెట్‌లో 2వ ర్యాంకు రావటం చాలా ఆనందంగా ఉంది. రానున్న ఐఐటీ అడ్వాన్స్డ్ పరీక్షలో మంచి మార్కులు సంపాదించి.. తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలనుకుంటున్నా. ఐఐటీ బాంబేలో చేరి.. భవిష్యత్‌లో మంచి ఉద్యోగం సంపాదిస్తాను. -వరదా మహంతనాయుడు, ఈఏపీసెట్ 2వ ర్యాంకు విద్యార్థి
రోజుకు 12 గంటలు చదివాను
తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతోనే మంచి ర్యాంకును సాధించాను. రోజుకు 12గంటలు కష్టపడ్డాను. ప్రతి చిన్న విషయాన్ని ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకోవటంతో.. మంచి ర్యాంకు వచ్చింది. -కార్తికేయ, ఈఏపీసెట్ 9వ ర్యాంకు విద్యార్థి
ఇదీ చదవండి: