ETV Bharat / city

పట్టాలెక్కని రైళ్లు...ప్రజలకు తప్పట్లేదు పాట్లు

పండగ సమయాల్లో ప్రయాణికులతో కిటకిటలాడే రైల్వేస్టేషన్లు ఈసారి కరోనా దెబ్బకి బోసిపోతున్నాయి. దసరా, దీపావళి దృష్ట్యా పరిమిత సంఖ్యలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్న రైల్వే శాఖ.. కొవిడ్‌ భయం కారణంగా అన్ని సాధారణ రైళ్లను ఇంకా పట్టాలెక్కించలేదు. ప్రయాణికుల డిమాండ్‌కు ఈ రైళ్లు ఏ మూలకూ చాలక ఇబ్బందులు పడుతున్నారు.

trains
trains
author img

By

Published : Oct 31, 2020, 6:01 AM IST

కొవిడ్‌ దెబ్బకు రాష్ట్రంలోని రైల్వేస్టేషన్లు వెలవెలబోతున్నాయి. ఇప్పటికీ వందలాది రైళ్లు షెడ్లకే పరిమితమయ్యాయి. నిత్యం వందలాది రైళ్లలో రద్దీగా ఉండే విజయవాడ జంక్షన్‌.. ఈసారి పండగ వేళల్లోనూ ఖాళీగా కనిపిస్తోంది. అన్‌లాక్‌ తర్వాత అతి కొద్ది సంఖ్యలోనే ప్రత్యేకరైళ్లు నడుస్తున్నాయి. దసరా పండుగకైనా అన్ని రైళ్లు పట్టాలెక్కుతాయని ఆశించిన ప్రయాణికుల కోరిక నెరవేరలేదు. సీజన్‌ మొత్తానికి కలిపి కేవలం 61 రైళ్లను మాత్రమే నడిపారు. ఒకట్రెండు ప్లాట్‌ఫాంలు మినహా మిగతావన్నీ ఖాళీగా మారాయి.

విజయవాడ నుంచి హైదరాబాద్‌, విశాఖ, ఉభయగోదావరి జిల్లాలకు వెళ్లే రైళ్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. ఆర్టీసీ బస్సులు కూడా సరైన సంఖ్యలో లేనందున ప్రైవేటు వాహనాల వాళ్లు దండుకుంటున్నారు. తక్కువ ఛార్జీతో ప్రయాణించే సౌలభ్యం కారణంగా చాలా మంది రైళ్లపైనే ఆధారపడ్డారు. రద్దీగా ఉండే మార్గాల్లో తగినన్ని రైళ్లు లేక వారికి ప్రయాణపాట్లు తప్పడం లేదు..

కొవిడ్ వ్యాప్తి భయం కారణంగానూ రైల్వేస్టేషన్లకు ప్రయాణికుల రాక తగ్గిందన్నది అధికారులు చెబుతున్న మాట. ఏదేమైనా త్వరగా అన్ని రైళ్లనూ పునరుద్ధరించి పూర్వపు స్థితిని తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి : బ్యాంకులపై కొవిడ్ దెబ్బ... బకాయిపడ్డ క్రెడిట్ కార్డు వసూళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.