స్వాబ్ పరీక్షలో నెగిటివ్ వచ్చినా, సీటీ స్కాన్ పరీక్షలో పాజిటివ్ లక్షణాలు వస్తోన్న కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ప్రముఖ ఛాతీ వైద్య నిపుణులు డాక్టర్ కనుమూరి బసవ శంకరరావు వివరించారు. కరోనా వైరస్ సోకిన 60 ఏళ్లు వయసు దాటిన వారిలో ఎలాంటి ఇతర అనారోగ్యాలు లేకపోయినా... లివర్, క్రియాటిన్ పరీక్షల్లో తేడాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రిలో చేరడం మేలని సూచించారు. ఇతరులు తమ వ్యాధి తీవ్రత ఆధారంగా ఇంట్లోనే ఉండి ఎప్పటికప్పుడు ఆరోగ్య స్థితిగతులను పరీక్షించుకుని వైద్యం పొందవచ్చని చెప్పారు. విజయవాడలో సుమారు 200 మందికిపైగా కొవిడ్ బాధితులకు హోం క్వారంటైన్ ద్వారా వైద్యం అందించినట్టు శంకరరావు 'ఈటీవీ భారత్'తో మాట్లాడిన సందర్భంగా వివరించారు.
ఇదీ చదవండీ... అన్ లాక్ 3.0.. మార్గదర్శకాలు అమలు చేస్తూ.. ఉత్తర్వులు