విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో.. కొవిడ్ విధులు నిర్వహిస్తున్న తాత్కాలిక ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. కొవిడ్ విధులను బహిష్కరించారు. ఐదు నెలలుగా తమకు రావాల్సిన వేతనాలను.. ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైద్యాధికారులకు సమ్మె నోటీసులిచ్చినా.. ఇంతవరకు తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి కొవిడ్ విధులు నిర్వహిస్తున్న తమకు.. వేతనాలు, వసతి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఆందోళన చేపట్టారు.
ఇదీ చదవండి: