ETV Bharat / city

బంగాళాఖాతంలో స్థిరంగా వాయుగుండం...రేపటి నుంచి వర్షాలు పడే అవకాశం

author img

By

Published : Nov 23, 2020, 3:23 PM IST

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం స్థిరంగా కొనసాగుతోందని భారత వాతావరణశాఖ స్పష్టం చేసింది. వాయుగుండం ప్రభావం వల్ల దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు తీరప్రాంతాల్లో 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. మత్స్యకారులెవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేసింది.

బంగాళాఖాతంలో  స్థిరంగా వాయుగుండం
బంగాళాఖాతంలో స్థిరంగా వాయుగుండం

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఇది తమిళనాడులోని పుదుచ్చేరి తీరానికి 600 కిలోమీటర్లు, చెన్నైకి 630 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాగల 24 గంటల్లో మరింత బలపడి తుపానుగా మారుతుందని వాతావరణశాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడులోని ప్రాంతాల్లో చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. వాయుగుండం ఈనెల 25 సాయంత్రానికి మామల్లపురం-కరైకాల్ మధ్య తీరాన్ని దాటే అవకాశముందని ఐఎండీ అంచనా వేస్తోంది.

వాయుగుండం ప్రభావం వల్ల దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు తీరప్రాంతాల్లో 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని..,తుపాను ప్రభావం పెరిగితే ఈదురుగాలుల వేగం 110 కిలోమీటర్లకు చేరుకునే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. మంగళవారం నుంచి కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయన్నారు. అటు రాయలసీమ, తెలంగాణాల్లోనూ కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది. వాయుగుండం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారటంతో మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్ళరాదని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.

ఇదీచదవండి

పోలవరం నిధుల సాధనకు రాజకీయ పార్టీలన్నీ కలిసి రావాలి: సీపీఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.