ETV Bharat / city

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాం: డీజీపీ - డీజీపీ సవాంగ్ తాజా వార్తలు

రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. వృద్ధులు, వికలాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో తమ వంతు సహాయం చేసిన పోలీసు సిబ్బందిని డీజీపీ ప్రత్యేకంగా ప్రశంసించారు. తదుపరి రెండు విడతల ఎన్నికలను మరింత సమర్థవంతంగా నిర్వహించేలా ప్రణాళికాయుతంగా ముందుకు వెళ్తామన్నారు.

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాం
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాం
author img

By

Published : Feb 13, 2021, 8:09 PM IST

రెండో విడత పంచాయతీ ఎన్నికలను సమర్థంగా నిర్వహించిన పోలీసు సిబ్బందిని డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. 57 ప్లటూన్ల ఏపీఎస్పీ బలగాలు, 20 కంపెనీల సీఆర్‌పీఎఫ్‌ బలగాలు, 41 వేల మందికిపైగా సివిల్ పోలీసులతో పాటు మొత్తం 47 వేల మందిని రెండో విడత ఎన్నికలకు వినియోగించినట్లు ఆయన తెలిపారు. తొలి విడత ఎన్నికలతో పోలిస్తే రెండో విడతలో ఎక్కువ శాతం పోలింగ్ నమోదైందని..ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఓటర్లు నిర్భయంగా తమ హక్కును వినియోగించుకున్నారని..స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగడం సంతోషకరమన్నారు.

ప్రజాస్వామ్య మనుగడకు ఎన్నికలు ఎంతో అవసరమని డీజీపీ అభిప్రాయపడ్డారు. వృద్ధులు, వికలాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో తమ వంతు సహాయం చేసిన పోలీసు సిబ్బందిని డీజీపీ ప్రత్యేకంగా ప్రశంసించారు. తదుపరి రెండు విడతల ఎన్నికలను మరింత సమర్థవంతంగా నిర్వహించేలా ప్రణాళికాయుతంగా ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ఓటర్లు మరింత నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. చక్కటి వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు వివిధ శాఖల ఉద్యోగులు అన్ని విధాలా సహకరించారన్నారు.

ఇదీచదవండి

లోకల్ రిజల్ట్: వెలువడుతున్న రెండవ దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.