ETV Bharat / city

DGP: పోస్టుమార్టం నివేదిక అందగానే తదుపరి చర్యలు: డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి - సుబ్రహ్మణ్యం మృతిపై మాట్లాడిన డీజీపీ

DGP: ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవరు సుబ్రహ్మణ్యం మృతి కేసు దర్యాప్తు చేస్తున్నామని.. పోస్టుమార్టం నివేదిక అందగానే తదుపరి చర్యలు తీసుకుంటామని డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

DGP rajendranath reddy reacts over mlc ananthababu driver subramanyam death case
డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి
author img

By

Published : May 23, 2022, 7:21 AM IST

DGP: ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవరు సుబ్రహ్మణ్యం మృతి కేసు దర్యాప్తు చేస్తున్నామని.. పోస్టుమార్టం నివేదిక అందగానే తదుపరి చర్యలు తీసుకుంటామని డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. ఆదివారం తిరుపతి నుంచి విజయవాడ వెళ్తూ మార్గమధ్యలో ఆయన నెల్లూరులోని పోలీసు అతిథిగృహంలో బసచేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నేరాల కట్టడిలో భాగంగా నైట్‌బీట్‌ను బలోపేతం చేసి నేరచరిత్ర కలిగిన వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచామని వివరించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా 25 మోడల్‌ స్టేషన్లను నిర్మిస్తామన్నారు. ఏదైనా నేరం జరిగితే రోజుల వ్యవధిలోనే విచారణ పూర్తిచేసి కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేయడంతో పాటు న్యాయవ్యవస్థ సహకారంతో దోషులకు త్వరితగతిన శిక్షలు పడేలా చేస్తున్నామని తెలిపారు. కేసుల పరిశోధనల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని చెప్పారు. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని, కొత్త జిల్లాల్లో పోలీసు కార్యాలయాలను దశలవారీగా నిర్మిస్తామని పేర్కొన్నారు. గంజాయి సాగు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని, నిరంతర తనిఖీలతో కొంతవరకు తగ్గిందన్నారు. ఆయనతో పాటు జిల్లా ఎస్పీ సీహెచ్‌ విజయరావు తదితరులున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.