ETV Bharat / city

Devotees in Medaram: మేడారం ఆలయంలో భక్తుల రద్దీ.. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు - మేడారానికి పెరిగిన రద్దీ

Devotees in Medaram: తెలంగాణలో ప్రసిద్ధి చెందిన మేడారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో సరిహద్దు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. పలువురు రాజకీయ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు.

Medaram Temple
మేడారం ఆలయంలో భక్తుల రద్దీ.. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
author img

By

Published : Jan 9, 2022, 11:00 PM IST

Devotees in Medaram: తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో సమ్మక్క-సారలమ్మ వనదేవతల దేవాలయం ఒక్కసారిగా కిటకిటలాడింది. ఆదివారం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచే కాక.. సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ నుంచి భారీ సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు.

మొదటగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు.. తలనీలాలు సమర్పించుకుని అమ్మవారికి పూజలు చేశారు. వన దేవతలకు పసుపు, కుంకుమ, చీరలు కట్టి నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుని అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు.

అమ్మవారి సేవలో కడియం శ్రీహరి, ఎమ్మెల్యే సీతక్క
MLA seethakka in medaram: మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుటుంబ సమేతంగా వచ్చి సమ్మక్క-సారలమ్మ వన దేవతలను దర్శించుకున్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క కుటుంబంతో సహా వచ్చి అమ్మవార్లకు పూలు, పళ్లు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు కొట్టి అమ్మవార్ల మొక్కులు చెల్లించుకున్నారు.

మేడారం జాతరకు ఏర్పాట్లు
Arrangements for jatara: వచ్చేనెలలో జరగనున్న మేడారం జాతరకు ఆలయంలో ఏర్పాటు చేస్తున్నారు. రెండేళ్లకొకసారి జరిగే మేడారం జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై ఆరా తీశారు.

ఇవీ చూడండి:

Vizianagaram: ఏనుగుల దాడి.. అటవీశాఖ ఉద్యోగి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.