తెదేపా నేతలు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను అరెస్టు చేయటంపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. కొల్లు రవీంద్రను హత్యకేసులో అరెస్టు చేయటంపై ఆయన పలు అనుమానాలు వ్యక్తపరిచారు.
"మోకా భాస్కరరావు హత్య కేసు వివరాలు ఎందుకు చెప్పలేకపోయింది. కొల్లు రవీంద్రను తునిలో అరెస్టు చేశామని చెప్పారు. కేసుతో రవీంద్రకు సంబంధం లేదని అధికారులే చెప్పారు. బీసీ నేతగా ఎదుగుతున్నారనే కొల్లు రవీంద్రపై కుట్ర పన్నారు. అగ్నికుల క్షత్రియ నేతను దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్నారు. రవీంద్ర గోడ దూకి పారిపోయారని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. కొల్లు రవీంద్ర వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేందుకు కథలు అల్లుతున్నారు. కొల్లు రవీంద్ర ఎలాంటివారో అందరికీ తెలుసు. అచ్చెన్నాయుడు కుటుంబం చేసిన పాపం ఏమిటి?. ఎర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజు కుటుంబాలపై కక్ష కట్టారు. మీ అవినీతిని సూటిగా ప్రశ్నించారనే అచ్చెన్నపై కేసు. ఈఎస్‌ఐ కేసుతో ఎలాంటి సంబంధం లేని అచ్చెన్నను అరెస్టు చేశారు" -దేవినేని ఉమామహేశ్వరరావు