పోలవరం నిర్వాసితుల నిధుల్లో జరిగిన అవకతవతలపై చర్చకు సిద్దమని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. చర్చ కోసం తాడేపల్లికి రమ్మంటారా? పోలవరం ప్రాజెక్టు వద్దకు రమ్మంటారా? చెప్పాలని సవాల్ విసిరారు. పోలవరం పాపం జగన్దేనన్న ఆయన.., ప్రాజెక్టు కోసం కేంద్రం ఇచ్చిన నిధులను నిర్వాసితులకు ఇవ్వలేదని విమర్శించారు.
"పోలవరం నిర్వాసితుల నిధుల్లో అవకతవతలపై చర్చకు సిద్ధం. చర్చ కోసం తాడేపల్లి రావాలా ? పోలవరం ప్రాజెక్టు వద్దకు రావాలా..? ప్రాజెక్టు కోసం కేంద్రం ఇచ్చిన నిధులను నిర్వాసితులకు ఇవ్వలేదు. కేంద్ర నిధులేమయ్యాయో జగన్ సమాధానం చెప్పాలి. పోలవరం ఎత్తు తగ్గించడానికి జగన్ సిద్ధమని కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ ప్రకటనను జగన్, మంత్రులు ఎందుకు ఖండించలేదు. కేసీఆర్ నుంచి ఎన్నికల నిధులు వచ్చినందునే ఏమీ చెప్పట్లేదు." -దేవినేని, మాజీ మంత్రి
సీఎఫ్ఎంఎస్ నుంచి ఆఫ్లైన్ పేమెంట్లు జరుగుతున్నాయంటూ దేవినేని తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎఫ్ఎంఎస్ సిస్టంలో జరుగుతున్న పేమెంట్ల విధానంపై విచారణ జరిపితే జగన్ జైలుకెళ్లటం ఖాయమని అన్నారు. 'లక్ష కోట్ల రూపాయల బిల్లులు చెల్లిస్తే.. సజ్జల గిల్లుడు రూ.20 వేల కోట్లు' అని ఆరోపించారు. సీఎఫ్ఎంఎస్ విధానాన్ని మంచి కోసం ప్రవేశపెడితే.. ఆ వ్యవస్థను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. కాగ్ అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించారని, ఇప్పుడు ఆయనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అన్నారు. చాలా మంది నేతలపై తప్పుడు కేసులు పెట్టించి జైళ్లకు పంపారని దుయ్యబట్టారు. తాము ప్రాణాలకు తెగించి ప్రభుత్వంతో పోరాడుతున్నామని తెలిపారు.
ఇవీ చూడండి :
'భాజపావి నీచ రాజకీయాలు.. కశ్మీరీ పండిట్లకు రక్షణేదీ?'
Cruise Ship: విశాఖలో విలాసాల ఓడ.. ఎన్ని వసతులో చూశారా..!
ఒకే ఓవర్లో 6 సిక్సర్లు.. 19 బంతుల్లోనే 83.. టీ10 లీగ్లో పాండే వీరవిహారం!