విజయవాడ పున్నమి తోట పరిధిలోని 19వ డివిజన్లో వైకాపా అభ్యర్థి రెహానా నాహీద్ తరపున విజయవాడ తూర్పు నియోజక వర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాశ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైకాపా అభ్యర్థిని గెలిపించి డివిజన్ అభివృద్ధికి కృషి చేయాలని ఓటర్లను కోరారు. నిత్యం ప్రజలతో మమేకమై..సమస్యల కృషికి పాటు పడతానని అభ్యర్థి రెహానా నాహీద్ స్పష్టం చేశారు. డివిజన్ అభివృధ్ధిలో భాగంగా షాదీఖానా నిర్మాణం, వాకింగ్ ట్రాక్‌ల ఏర్పాటు, కాల్వగట్ల సుందరీకరణ వంటి కార్యక్రమాలు చేపడతామని ప్రజలకు హామీ ఇచ్చారు.
ఇదీచదవండి