ETV Bharat / city

'పంచాయతీ ఎన్నికల్లానే పురపోరులోనూ వైకాపాను గెలిపించండి' - విజయవాడ పురపోరు ప్రచారంలో పాల్గొన్న మంత్రులు అంజద్ బాషా, వెల్లంపల్లి

కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడమే తమ లక్ష్యమని.. ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి తెలిపారు. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా.. విజయవాడ పంజా సెంటర్​లోని పలు డివిజన్లలో ప్రచారం వారు నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో పట్టం కట్టినట్లుగానే మున్సిపల్ పోరులోనూ విజయం కట్టబెట్టాలని ఓటర్లను కోరారు.

ministers campaign for vijayawada municipal elections
విజయవాడ మున్సిపల్ ఎన్నికల కోసం మంత్రుల ప్రచారం
author img

By

Published : Feb 23, 2021, 10:44 PM IST

విజయవాడ పంజా సెంట‌ర్​లోని పలు డివిజన్లలో ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా, దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు.. మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గాంధీబొమ్మ సెంట‌ర్, మ‌హంతిపురంలో వైకాపా శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికీ అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో పట్టం కట్టిన విధంగానే.. పురపోరులోనూ వైకాపాకు ప్రజలు అధికారం ఇస్తారని ఆశిస్తున్నట్లు అంజద్ బాషా పేర్కొన్నారు. గత ప్రభుత్వం కంటే సీఎం జగన్ పాలనలో మైనార్టీలకు అధికంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్నారు.

ఇదీ చదవండి:

ఐటీ విభాగంలో ఆర్టీసీకి వరుసగా రెండోసారి జాతీయస్థాయి అవార్డు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.