విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు 8వ రోజుకు చేరుకున్నాయి. అమ్మవారు ఇవాళ శ్రీ మహిషాసుర మర్ధనీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. రాక్షసులను సంహరించి స్వయంభుగా వెలిసిన మహిషాసుర మర్ధనీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
అష్ట భుజాలతో అవతరించి, సింహవాహినియై దుష్టుడైన మహిషాసురుడిని అమ్మవారు సంహరించిందని.. అలాంటి మహిషాసుర మర్ధనిని దర్శించుకుంటే అరిషడ్వర్గాలు నశించి, సాత్విక భావం ఏర్పడుతుందని పురాణోక్తి. సర్వదోషాలూ పటాపంచలై ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం.
రేపటితో దసరా వేడుకలు ముగియనున్న నేపథ్యంలో ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. మహిషాసురమర్ధనీ దేవిని దర్శించుకుంటే.. దసరా రోజున రాజరాజేశ్వరిని కూడా తప్పక దర్శించుకోవాలనే భావన భక్తుల్లో ఉండడంతో.. కొండపై భక్తుల రద్దీ పెరిగిపోతోంది.
ఇదీ చదవండి: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చిన శ్రీనివాసుడు