శ్రీశైలం జలాశయం 10 గేట్లు 18 అడుగులు మేర ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. జలాశయం ఇన్ ఫ్లో 4.17 లక్షల క్యూసెక్కులు ఉండగా... ఔట్ ఫ్లో 4.50 లక్షల క్యూసెక్కులు ఉంది. ప్రస్తుత నీటిమట్టం 883.50 అడుగులకు చేరింది. నీటి నిల్వ 207.4103 టీఎంసీలు నమోదైంది.
నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం భారీగా వస్తోంది. ఇన్ ఫ్లో 3,95,269 క్యూసెక్కులు ఉండగా...సాగర్ 6 గేట్లు ఎత్తి 45వేల క్యుసెకులు దిగువకు అధికారులు నీరు విడుదల చేశారు. ప్రస్తుత నీటిమట్టం 583.2 అడుగుల మేర ఉంది. పూర్తి నీటిమట్టం 590 అడుగులు అని అధికారులు తెలిపారు. ప్రస్తుత నీటి నిల్వ 289.36 టీఎంసీలు కాగా...పూర్తి నీటి నిల్వ 312.04 టీఎంసీలు.
ప్రకాశం బ్యారేజ్‌కు ఎగువ నుంచి 37,448 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. బ్యారేజ్ నుంచి దిగువకు 72,589 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్‌లో 57 అడుగుల నీటిమట్టం ఉంది. మున్నేరు వాగుకు ఎగువ నుంచి 38,531 క్యూసెక్కుల నీరు చేరుతోంది...అంతేనీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు.
ఇదీ చూడండి