రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌లో చేపట్టిన నిరసనలకు సీపీఎం మద్దతు తెలిపింది. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు అన్నీ ఒకే చోట ఉండాలని మధు అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణతో ప్రాంతాలను అభివృద్ధి చేయాలని.. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలన్నారు.
రాజకీయ లబ్ధి కోసమే
మూడు రాజధానుల ప్రతిపాదనతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి.. రాజకీయ లబ్ధి పొందేందుకే ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి బుద్దా వెంకన్న ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రంలో కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని.. ఇలాంటి ప్రకటనల వల్ల రాష్ట్రం మరింత సంక్షోభంలో పడే ప్రమాదం ఉందన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన ఉపసంహరించుకునే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: