పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని కోరుతూ.. విజయవాడ గుణదల విద్యుత్ సౌధ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. సంస్కరణల పేరుతో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యుత్ ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు పలువులు నేతలు పాల్గొన్నారు.
ఇదీ చదవండీ.. బ్యాంకర్లతో సీఎం సమావేశం.. రుణ ప్రణాళికపై చర్చ