మహిళలు, ఎస్సీలపై దాడులను నిరసస్తూ సీపీఐ ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్‌టేబుల్ నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను అదుపు చేసేందుకు ఏర్పాటు చేసిన మోనిటరింగ్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయడం లేదని సీపీఐ నేతలు నిలదీశారు. ఎస్సీ, ఎస్టీల కమిషన్ ఛైర్మన్ ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై సీఎం జగన్‌కు లేఖ రాసినా స్పందన లేదని వామపక్ష నేతలు అసహనం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: పోలీసుల ఉదాసీనత వల్లే రాజ్యాంగ ఉల్లంఘనలు: చంద్రబాబు