మున్సిపల్ ఎన్నికలకు తాజా ప్రకటన ఇస్తే బాగుండేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. నామినేషన్లు, పోలింగ్ మధ్య ఏడాది వ్యవధి వచ్చిందని..అభ్యర్థులను వైకాపా నేతలు పలుచోట్ల ప్రలోభాలకు గురి చేశారని విమర్శించారు. గత నామినేషన్లలో బెదిరింపులు, దాడులకు పాల్పడ్డారన్నారు. ఇతరులను నామినేషన్ వేయనీయకుండా ఏకగ్రీవం చేసుకున్నారని ఆరోపించారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఎంపీటీసీ, జడ్పీటీసీలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్ఈసీని కోరారు.
ఇదీచదవండి