మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఖండించారు. కరోనా మహమ్మారి వ్యాప్తిపట్ల అప్రమత్తం చేయడమే చంద్రబాబు చేసిన నేరమా అంటూ ఆయన ప్రశ్నించారు. జార్ఖండ్ సీఎం సోరెన్ ట్వీట్ పై ప్రధాని మోదీకి అందరం సపోర్ట్ చేయాలని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించడం కక్షసాధింపు కాదా? అంటూ రామకృష్ణ నిలదీశారు. తనకో నీతి.. ఎదుటివారికి మరో నీతి అన్న రీతిలో సీఎం జగన్ వైఖరి కొనసాగుతోందని విమర్శించారు. తక్షణమే చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: