గ్రామాలు, పారిశ్రామికవాడల్లో విద్యుత్ కోతలు మెుదలైనా.. ఎక్కడా కోతలు లేవని మంత్రులు చెప్పటం విడ్డూరంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కరెంట్ కోతలపై ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని ఇంధన శాఖ కార్యదర్శి హెచ్చరించటం గర్హనీయమన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, అప్పులపై జగన్ ప్రభుత్వం నిజాలు ఎందుకు చెప్పదని ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని రాజకోట రహస్యం మాదిరిగా.. ఏ విషయాలూ బయటపెట్టడం లేదని ఆక్షేపించారు.
ప్రజలు జగన్మోహన్రెడ్డికి అధికారమిస్తే.. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు. అప్పుల కోసమే ఆర్థిక మంత్రి బుగ్గన దిల్లీలో తిష్ట వేశారన్నారు. రెండున్నరేళ్ల పాలనలో తీసుకొచ్చిన అప్పు, చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు చేసిన ఖర్చు వివరాలు ప్రజలకు చెప్పాలన్నారు. అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రామకృష్ణ.
ఇదీ చదవండి
శ్రీగణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించిన సీఎం జగన్