CPI Ramakrishna On Railway Zone: రైల్వేజోన్ సహా ప్రతి అంశంలోనూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. 2019 ఫిబ్రవరిలో నాటి రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విశాఖ రైల్వే జోన్ కోసం ఉత్తరాంధ్ర ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారని అన్నారు. ఏపీని కేంద్రం అడుగడుగా మోసం చేస్తోందని రామకృష్ణ దుయ్యబట్టారు. ఈ అంశంపై రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు ఇప్పటికైనా గళమెత్తాలని సూచించారు.
రైల్వేజోన్‌పై సందిగ్ధత..
విభజన హామీల్లో ఇచ్చిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుపై.. సందిగ్ధత నెలకొంది. కొత్తగా ఏర్పాటైన జోన్ల జాబితాలోనూ.. దక్షిణ కోస్తా రైల్వే జోన్ లేకపోవడంతో ఈ అంశం మరోసారి చర్చనియాంశమైంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటులో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందని.. తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు లోకసభలో గళం విప్పారు. 2019 ఫిబ్రవరిలో హామీ ఇచ్చిన కొత్త జోన్ ఏర్పాటు అంశంపై ఇప్పటికీ పురోగతి లేదంటూ ధ్వజమెత్తారు. 2021-22లో కొత్త రైల్వే జోన్‌కు కేవలం 40 లక్షలు కేటాయించారని.. ఆ డబ్బుతో భవనం నిర్మించడమే కష్టమన్నారు. కొత్తగా ఏర్పాటైన జోన్ల జాబితాలోనూ.. దక్షిణ కోస్తా రైల్వే జోన్ లేకపోవడంపై ఏంటని ప్రశ్నించారు.
ఇదీ చదవండి