CPI RAMAKRISHNA: వైకాపా ప్లీనరీ మొత్తం జగన్‌ను పొగడ్తల్లో ముంచెత్తడానికే సరిపోయిందని,.. ఆయనను జీవితకాల అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికేనా ప్లీనరీ? అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికతో వైకాపాలో అంతర్గత ప్రజాస్వామ్యానికి పాతరేసినట్లయిందని, ఇంకా నయం రాష్ట్రానికి జీవితకాల ముఖ్యమంత్రిగా ప్రకటించుకోలేదు.. అంటూ చురకలంటించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 సంస్థలపై దుమ్మెత్తిపోయడం దుర్మార్గమన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదేపదే పత్రికలు, మీడియా సంస్థలను తిట్టడం, బెదిరించడం మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో ఇప్పటికే అభివృద్ధి అటకెక్కిందని, అప్పులు రూ.8 లక్షల కోట్లకు చేరాయని విమర్శించారు. ప్రజా సంక్షేమానికి రూ.1.60 లక్షల కోట్లు వెచ్చించామని జగన్ చెబుతున్నారని, మిగిలిన రూ.నాలుగు లక్షల కోట్లతో ఏం అభివృద్ధి చేశారని రామకృష్ణ ప్రశ్నించారు.
ఇవీ చదవండి: