ETV Bharat / city

కొవిడ్ బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి: సీపీఎం - Mahaprasthanam vehicle in Vijayawada

కరోనా మృతదేహాలను ఉచితంగా తరలించే మహాప్రస్థానం వాహనాన్ని విజయవాడలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు ప్రారంభించారు. కొవిడ్ బాధితులకు భీమా సౌకర్యం కల్పించి.. రూ.10 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సీపీఎం ఆధ్వర్యంలో మహాప్రస్థానం వాహనం ప్రారంభం
cpi leader Baburao inaugurated Mahaprasthana vehicle
author img

By

Published : May 28, 2021, 5:33 PM IST

కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు డిమాండ్ చేశారు. విజయవాడలో కొవిడ్ మృతదేహాలను శ్మశాన వాటికకు తరలించే మహాప్రస్థానం వాహనాన్ని ఆయన ప్రారంభించారు. బాధిత కుటుంబాల ఇబ్బందుల దృష్ట్యా ఈ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు.

కరోనా మృతదేహాలకు అంత్యక్రియాలు నిర్వహించాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శవాలను ఖననం చేసేందుకు శ్మశానాల్లో చోటులభించని దయనీయ పరిస్థితి నెలకొందన్నారు. కొవిడ్ బాధితులకు బీమా సౌకర్యం కల్పించి.. మృతుల కుటుంబాలకు సాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి..

యువకుడి దారుణ హత్య.. ముక్కలుగా నరికి చంపాడు.. కుమార్తెను ప్రేమించాడనే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.